Movies

హీరో సుమన్ ప్రముఖ రచయత మనవరాలిని పెళ్లి చేసుకున్నాడు… ఎవరో తెలుసా?

సినిమాల్లో కొందరికి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. మరి కొందరు స్వశక్తితో ఎదుగుతారు. కానీ అనుకోని ఓ ఘటనతో అట్టడుగు స్థాయికి పడిపోయిన హీరో సుమన్ కొంతకాలానికి మళ్ళీ పూర్వ వైభవం సంపాదించుకున్నాడు. వివాదపాస్పద సంఘటన నుంచి అనూహ్యంగా కోలుకున్నాడు. షోటో కాన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాదు ఆరడుగుల అందగాడిగా యువ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సుమన్ అసలు పేరు సుమంత్ తల్వార్. మాతృ భాష తెలుగు కాకపోయినా తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. హీరో భానుచందర్ ఈయనకు మంచి ఫ్రెండ్ కావడం వలన తెలుగు సినిమాల్లో అందరికీ రికమండ్ చేయడంతో పాటు, ఇద్దరూ కల్సి చాలా సినిమాల్లో నటించారు.

ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్ ని తెలుగులో విస్తృతం చేసారు సుమన్,భానుచందర్ లు.యూత్ ని టార్గెట్ చేసుకుని,నేటి భరతం, దేశంలో దొంగలు పడ్డారు,వంటి చిత్రాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన సుమన్, తరంగిణి వంటి వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో పోటా పోటీగా సినిమాలు ఆడేవి. అయితే ఛరిష్మాలతో ముందుకు దూసుకువెళ్తున్న సమయంలో బ్లు ఫిలిం రాకెట్ లో సుమన్ పేరు వినిపించడం,ఆ కేసులో జైలుకి వెళ్లడం వంటి ఘటనలు అభిమానులను,సినీ జనాలను షాక్ కి గురిచేశాయి.

ఇక సుమన్ ని కూడా కుంగదీసాయి. జైలు నుంచి వచ్చాక, సినీ ఛాన్స్ లు రాకపోవడం,ప్రతిష్ట మంటగలసి పోవడంతో తేరుకోలేని డిప్రెషన్ లో పడిపోయిన సుమన్ కి మళ్ళీ అదృష్టం తలుపు తట్టింది. పెళ్లి అనే సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.కారు దిద్దిన కాపురం వంటి చిత్రాలను చేసిన ప్రముఖ రచయిత డివి నరసరాజు తన మనవరాలిని సుమన్ కి ఇచ్చి పెళ్ళిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు,సుమన్ పట్ల అందరికీ పాజిటివ్ దృక్పధం ఏర్పడేలా చేసింది.

సుమన్ చెడ్డవాడు అయితే, రాజుగారు తన మనవరాలు శిరీషను ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారనే క్వశ్చన్ వచ్చింది. దీంతో సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. పెద్దింటి అల్లుడు,అలెగ్జాన్డర్, బావ మరిది,అబ్బాయి గారి పెళ్లి వంటి చిత్రాలతో కెరీర్ ట్రాక్ లో పడింది. పోయిన ప్రతిష్ట తిరిగి దక్కింది. అదేసమయంలో అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్రతో తిరుగులేని పేరు ప్రతిష్టలు సొంతమయ్యాయి. కెరీర్ కొత్తపుంతలు తొక్కింది.

ఆ తర్వాత శ్రీరామదాసులో శ్రీరాముని పాత్ర దక్కడం మరింత క్రేజ్ వచ్చింది. ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ చిత్రంలో విలన్ పాత్రతో డిఫరెంట్ రోల్ లోనూ మెప్పించిన సుమన్ కి ఇంతగా క్రేజ్ వచ్చిందంటే,కష్ట సమయంలో అతని జీవితంలో అడుగుపెట్టిన శిరీష కారణం. వీరికి గల ఏకైక కుమార్తె, అఖిలాజా ప్రత్యూష సినిమాల్లో ఎంట్రీ ఇస్తే తనకు అభ్యంతరం లేదని సుమన్ అంటున్నాడు. ఇక తెలంగాణాలో యాక్టివ్ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టాలని కూడా సుమన్ భావిస్తున్నాడు.