Movies

అరవింద సమేత సినిమాను మిస్ చేసుకున్న హీరో…ఆ హీరో చేసుంటే…?

అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ కు మద్య మంచి బాండింగ్ ఉంది దాంతో తరచుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు కలుస్తూనే ఉంటారట ! అలాగే ఇద్దరూ కలిసి జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు రెండు కూడా మంచి హిట్స్ అయ్యాయి దాంతో మూడో సినిమా కోసం హ్యాట్రిక్ కోసం మళ్ళీ సినిమా చేయాలనీ భావిస్తున్నారు కూడా . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం అరవింద సమేత వీర రాఘవ చిత్ర కథ అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ చెప్పాడని అయితే ఎంటర్ టైన్ మెంట్ కాస్త తక్కువగా ఉందని , కాస్త మార్పులు చేయమని సలహా ఇచ్చాడట అల్లు అర్జున్ .

అయితే ఇది అల్లు అర్జున్ కోసం చేసిన కథ నా ? లేక యధాలాపంగా చెప్పాడా ? అన్నది తెలియాల్సి ఉంది . అరవింద సమేత కథ మాత్రం అల్లు అర్జున్ విన్నాడట ! యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ తక్కువగా ఉండటంతో అల్లు అర్జున్ అరవింద సమేత కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది .

దాంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు దగ్గరకు వెళ్ళాడని కట్ చేస్తే ఇప్పుడు అరవింద సమేత ఘన విజయం అందుకున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది . అయితే అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు .