మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?

మన టాలీవుడ్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు. అలాగే వారు ఎంత వరకు చదువుకున్నారు. వారు చదువు అయ్యాక సినీ రంగానికి వచ్చి తామెంతో నిరూపించుకున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

1. మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నై లో లయోలా కళాశాల నుంచి కామర్స్ లో బాచిలర్స్ డిగ్రీ పొందాడు. చదువు పూర్తయిన తర్వాత, అతను 1999 లో ‘రాజ కుమారుడు’ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

2. పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు యుద్ధ కళల ట్రేనీ గా పనిచేసేవాడు. ఆయన 1998 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా నటనకు శ్రీకారం చుట్టాడు.

3. ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్కూల్ చదువు భీమవరం DNR స్కూల్ లో, ఇంటర్ మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ లో చదివాడు. ప్రభాస్ B.tech పూర్తి చేసాక 2002 లో సినిమాల్లోకి వచ్చాడు.

4. రామ్ చరణ్

1985 లో జన్మించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చెన్నై లో పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్లో చదివాడు. అతను సినిమాల్లోకి రాక ముందు మార్షల్ ఆర్ట్స్ అండ్ హార్స్ రైడింగ్ లో ప్రొఫెషనల్ శిక్షణను పొందాడు.

5. గోపీచంద్

గోపీచంద్ సినిమాల్లోకి రాక ముందు ప్రముఖ వార్తా చానెల్ ETV లో న్యూస్ రీడర్ గా పనిచేసాడు. 2001 లో ‘తోలి వలపు’సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు.

6. నాని

నాని సినిమాల్లోకి రాక ముందు విశాఖపట్నంలో ఒక రేడియో జాకీగా పనిచేసేవాడు. సినిమాల్లోకి వచ్చాక మొదటి సినిమా ‘అలా మొదలైంది’ ద్వారా హిట్ కొట్టాడు.

7. మోహన్ బాబు

మోహన్ బాబు స్కూల్ లో ఫిజికల్ ట్రైనర్ గా పనిచేసేవారు. 1974 లో ‘కన్నవారి కలలు’ సినిమా ద్వారా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు.

8. బ్రహ్మానందం

బ్రహ్మానందం సినిమాల్లోకి రాక ముందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని అత్తిలి పట్టణంలో లెక్చరర్ గా పనిచేసేవాడు. ఈ హాస్య నటుడు అనేక సినిమాలను చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.