గాయని S.P. శైలజ గుర్తు ఉందా…. ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా? S.P.బాలు సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు?
రాసిపెట్టి ఉంటే జరిగితీరుతుంది. అనుకోకుండా అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. సరిగా ప్రముఖ గాయని,డబ్బింట్ ఆర్టిస్ట్,నటి ఎస్పీ శైలజ విషయంలో జరిగిందని చెప్పాలి. స్టేజి పై పాట అలానే పాడింది. ఇక సినిమాల్లో ఛాన్స్ కూడా అలాగే వచ్చింది. అనుకోకుండా నటి అయింది. ప్రముఖ గాయకుడు,గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సోదరి అయిన శైలజ సొంత ప్రతిభతో రాణించారు. ఇక ఈమె భర్త శుభలేఖ సుధాకర్ మంచి నటుడిగా రాణిస్తున్నారు. ఎన్నో మధుర గీతాలను ఆలపించిన ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎందరికో గాత్ర సహకారం అందించి మెప్పించారు. నెల్లూరు జిల్లాలోని కొనేటప్ప పేటలో ఈమె జన్మించింది. వీరి తండ్రి ఎస్పీ సాంబ మూర్తికి హరికథ లపై ప్రావిణ్యం ఉండడంతో అందరికీ సంగీతంపై మక్కువ ఏర్పడింది.
అయితే సాంప్రదాయ కుటుంబం కావడం వలన ఈమెను బయట పాడించేవారు కాదట వీరి తండ్రి.నిజానికి శైలజకు ఐదారేళ్ళు వచ్చేసరికి సోదరుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినిమా రంగంలోనే ఉన్నారు. తల్లి ప్రోత్సాహంతో స్కూల్లో పాటలు పాడే శైలజ పలు పోటీల్లో బహుమతులు కూడా గెలుచుకుంది. సోదరుడు సినిమా రంగంలో పాపులర్ అయినప్పటికీ శైలజకు సినిమాల్లో పాడాలని ఎప్పుడూ అనిపించలేదట. 1976లో ఎస్పీ బాలు గుంటూరులో కచేరి చేయాల్సి వచ్చింది.
అయితే ఫీమేల్ సింగర్ ఆఖరి నిమిషంలో రాలేదట. దీంతో ఏం చేయాలో పాలుపోలేదట. అప్పుడు శైలజ చేత పాడిస్తే బాగుంటుందేమో అని మేనేజర్ సూచన చేయడంతో,అప్పుడు 8వ తరగతి చదువుతున్న శైలజ అలా తొలిసారి బయట స్టేజి మీద అందునా సోదరునితో కల్సి సంగీత కచేరీలో పాడే ఛాన్స్ కొట్టేసింది.అలా మొదటిసారి వచ్చిన ఛాన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఏదో ఇంట్లో పడుకోవడం తప్ప మళ్ళీ ఎప్పుడు స్టేజిపై పాడిన దాఖలాలు లేవు.
ఓసారి సింగపూర్ లో కచేరి చేయాల్సి రావడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెళ్తుంటే,ఫామిలీ మొత్తం వీడ్కోలు పలకాలని అక్కడికి వచ్చారు. విమానం ఆలస్యం కావడంతో అక్కడే అందరూ సరదాగా పాటలు పాడుకుంటుంటే, శైలజ గొంతు విన్న మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఆనంద పడ్డారట. ఆతర్వాత ఓ సారి చక్రవర్తి స్వయంగా ఫోన్ చేసి సినిమాలో పాడే ఛాన్స్ ఇచ్చారట. ఆవిధంగా మార్పు సినిమాలో సోదరుడు బాలు తో కల్సి ‘ఇద్దరం మేమిద్దరం’అనే పాటను పాడారు.
ఆ తర్వాత చదువు మీదే దృష్టి పెట్టిన శైలజ 10వ తరగతికి వచ్చేసరికి, సినీమాల్లో ఆఫర్లు రావడంతో స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టి సింగర్ గా స్థిరపడాలని భావించారు. ఆవిధంగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ‘పొన్ను ఉడుక్కు ఫారుసు’ అనే తమిళ మూవీలో శైలజ చేత సోలో గీతం పాడించారు.ఇక ఈ పాటతో తెలుగు,తమిళ సినిమాల్లో వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. శివరంజని,ప్రాణం ఖరీదు,మనవూరి పాండవులు, శంకరాభరణం,సీతాకోక చిలుక,సాగర సంగమం,స్వాతిముత్యం, రుద్రవీణ, సిరివెన్నెల,సూత్రధారులు,అన్నమయ్య ఎలా ఎన్నో సినిమాల్లో తనగొంతుతో శ్రోతలను అలరించారు.
శైలజ కన్నడలో కూడా ఎక్కువ పాటలు పాడారు. తమిళ,మలయాళ చిత్రాల్లో కల్పి దాదాపు 5వేలకు పైనే పాటలు పాడారు. ఇక అనుకోకుండా సాగర సంగమం చిత్రంలో కూడా భారత నాట్యం నేర్చుకునే అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. మొదట్లో నటనకు ఒప్పుకోకపోవడంతో శైలజ తండ్రికి డైరెక్టర్ విశ్వనాధ్ నచ్చజెప్పి ఒప్పించారట. అలా వెండితెరపైనా మెరిసింది. చిన్నప్పుడు నాట్యంలో ప్రవేశం కూడా ఉన్నందున ఓం నమశివాయ పాటలో నాట్యం చేసింది.
అయితే ఎప్పటికప్పుడు డాన్స్ కంపోజ్ మార్చేసేవారని, నటించడం కష్టమైందని శైలజ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ఇక అసలు పెళ్లి ఆలోచన లేని శైలజకు పెళ్లి చేయాలని బాలు భావించారు. ఎందుకంటే తండ్రి మరణించడంతో వెంటనే పెళ్లి చేసెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆసమయంలో శుభలేఖ సుధాకర్ పేరును జంధ్యాల సూచించడంతో ఒకే చేసేసారు. నిజానికి సుధాకర్ తో ముఖ పరిచయం ఉన్నా, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఊహించలేదని శైలజ చెబుతారు.