Movies

తనికెళ్ళ భరణి కొడుకు సినిమా మధ్యలో ఆగిపోవటానికి కారణం తనికెళ్ళ భరణి సపోర్ట్ ఇవ్వకపోవటమేనా?

సినిమాల్లో కొందరు కొన్నింటికి పరిమితం అయిపోతారు. కానీ కొందరు దేనికోసమో వచ్చి అన్నింటా అల్లుకుపోతారు. ఇందుకు ప్రబల నిదర్శనం తనికెళ్ళ భరణి. టాలీవుడ్ లో రచయితగా ఎంట్రీ ఇచ్చిన ఈయన కొన్ని సినిమాలకు రాసిన సంభాషణలు చూస్తే ఔరా అంటాం. అప్పటివరకూ ఒకలెక్క అయితే ఈయన హయాంలో మరోలెక్క అన్నట్లు మారిపోయింది. తర్వాత నటుడిగా మారిపోయారు. మనీ మనీ లాంటి చిత్రాల్లో ఆయన నటన సూపర్భ్. ఇక అతడు వంటి చిత్రాల్లో విలన్ గా అదిరిపోయే నటన చేసాడు. అంతేకాదు మిధునం సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తిన భరణి,ఆసినిమాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,లక్ష్మి లచేత అద్భుత నటన చేయించి ,ప్రశంసలు అందుకున్నారు.

ఇక అందరి హీరోల తనయుల మాదిరిగానే తనికెళ్ళ భరణి కొడుకు మిస్టర్ లవంగం మూవీ ద్వారా తేజ తనికెళ్ళ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. సాయికుమార్ నిర్మాతగా,చలపతి మల్లాది రచన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. నిజానికి కొడుకు హీరోగా నిలదొక్కుకోడానికి భరణి సపోర్ట్ చేయలేదని తానే ఓ ఇంటర్యూలో చెప్పాడు. సినిమాల ఇంట్రస్ట్ లేకపోవడం, హీరో కంటెంట్ లేదని నమ్మడం వలన ఏ సహకారం చేయలేదని,అందుకే లవంగం మూవీ అసలు రిలీజ్ అయిందో లేదో కూడా తనకు తెలీదని భరణి నిక్కచ్చిగా చెప్పేసాడు.

నిజానికి నా కుమారుడికి సైంటిస్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. నటన అంటే ఆసక్తి లేని తేజ,నేను లేని సమయంలో పొరపాటున ఒప్పుకున్నాడు. తనకి ఇష్టమైన దాంట్లో ఉద్యోగం పొంది బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు’అని భరణి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో 25ఏళ్లుగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన భరణి,తన కొడుకు విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని అందరూ అంటున్నారు.