Movies

రామ్ కెరీర్ మొద‌లై 13 ఏళ్లు దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ ఇమేజ్ రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

ప్ర‌తీసారి ఓ సినిమాతో రావ‌డం.. సారీ చెప్పి వెళ్లిపోవ‌డం జ‌రుగుతుంది. కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డే సినిమా మాత్రం రావ‌డం లేదు. నేనుశైల‌జ వ‌చ్చి రెండేళ్లైపోయింది.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం అందుకోలేకపోయాడు ఈ హీరో. హైప‌ర్ తో పాటు ఉన్న‌ది ఒక‌టే జంద‌గీ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు విడుద‌లైన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే కూడా యావ‌రేజ్ టాక్ తోనే మొద‌లైంది. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే క‌చ్చితంగా ఈ చిత్రం కూడా మూడు రోజుల ముచ్చ‌ట‌గా మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

అస‌లే ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊపేస్తుంది. దానికితోడు యాక్ష‌న్ ప్రియుల‌కు పందెంకోడి 2 ఉంది. ఇలాంటి టైమ్ లో రొటీన్ క‌థ‌తో వ‌చ్చిన హ‌లో గురు వైపు ప్రేమ చూపించ‌డానికి ప్రేక్ష‌కులు అయితే సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. వ‌ర‌స‌గా రొటీన్ క‌థ‌లు ఎంచుకుంటూ త‌న ఇమేజ్ కు తానే స్పాట్ పెట్టుకుంటున్నాడు రామ్.

ఇప్ప‌టికైనా తాను నిద్ర లేవ‌క‌పోతే క‌చ్చితంగా రాను రాను మ‌రిన్ని క‌ష్టాలు ప‌డ‌టం ఖాయం. మ‌రి ఇప్ప‌టికైనా రామ్ లో మార్పు వ‌స్తుందా..? వ‌చ్చి మ‌ళ్లీ కొత్త కథ‌ల వైపు అడుగేస్తాడా..? అదీ కాదంటే మ‌ళ్లీ రొటీన్ రూట్ అంటూ ఇటువైపే వ‌స్తాడా..?