అలనాటి నటి అనురాధ కూతురు అభినయ శ్రీ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
సినిమాలో వేషం కడితే చాలు,ఇక ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. ఎప్పుడు ఏ వేషం ఇచ్చినా చేయాలి. చేయకపోతే ఛాన్స్ లు రావు. ఒకవేళ ఏ పాత్రకు సై అన్నా సరే, ఒక్కోసారి ఛాన్స్ లు కూడా రావు. ఒకప్పుడు వాంప్ పాత్రలు, క్లబ్ డాన్స్ లకోసం ప్రత్యేకంగా కొందరు ఉండేవారు. విజయలలిత,జయమాలిని,అనురాధ,సిల్క్ స్మిత ఇలా క్లబ్ డాన్స్ లు,వాంప్ నృత్యాల కోసం పనిచేసేవారు. రాను రాను హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్ ల పేరుతొ ఎలాంటి డాన్స్ చేయడానికైనా ఒప్పేసుకోవడంతో వీళ్ళ ప్రాధాన్యత తగ్గిపోయింది.
ఒకప్పుడు అనురాధ వాంప్ నృత్యాలకు థియేటర్ లో చప్పట్లు,ఈలలతో మారుమోగిపోయేయి. ఇక ఆమె వారసురాలిగా అభినయశ్రీ రంగప్రవేశం చేసి పలు సినిమాల్లో నటించింది.అనురాధ పెద్దగా చదువుకోకపోయినా కూతురు అభ్భినయశ్రీని బాగా చదివించింది. బీఎస్సీ చదివిన ఈమె కాలేజ్ డేస్ నుంచే యాంకర్ గా, ఈవెంట్ మేనేజర్ గా మంచి పేరుతెచ్చుకుంది. ఆతర్వాత సినిమాల్లో చేరాక,తల్లి మాదిరిగా ఐటెం సాంగ్స్ తో ఓ ఊపు ఊపేసింది.
తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ తెలుగులో అలాంటి అవకాశం రాలేదు. శ్వేత నాగు,ఆప్తుడు వంటి మూవీస్ లో చిన్నరోల్స్ దక్కాయి. అయితే వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఐటెం సాంగ్స్ కి పరిమితం అయింది. ఆర్య మూవీలో అ అంటే అమలాపురం పాటకు వచ్చిన రెస్పాన్స్ ఇంతాయింతా కాదు. ఇక ఐటెం సాంగ్స్ కి కూడా ఛాన్స్ లు రాకపోవడంతో పాండవులు అనే సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో అభినయశ్రీ కనపడలేదు. సూపర్ అనే రియాల్టీ షో లో కనిపించి టివి ప్రేక్షకులకు వినడం పంచింది.
ఇక తెలుగుతో పాటు,తమిళంలో కూడా ఒక్క ఛాన్స్ రాని పరిస్థితి రావడంతో తల్లి ఇచ్చిన సూచనతో రూటు మార్చేసి,మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఒరిజనల్ గా మంచి డాన్సర్ కూడా కావడంతో నటన పక్కన పెట్టేసి,కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తిన అభినయశ్రీ తమిళ,కన్నడ చిత్రాలకు డాన్స్ డైరెక్టర్ గా పనిచేసి,మంచి పేరు తెచ్చుకుంది.
అయితే కొరియోగ్రాఫర్ గా చేయడం వలన రెమ్యునరేషన్ సరిపోక పోవడంతో మళ్ళీ నటనవైపు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఛాన్స్ లు వస్తాయో రావో చూడాలి.