హీరోయిన్స్ గా మారిన బాల నటులు…. ఏ పొజిషన్ లో ఉన్నారో చూడండి
ఇప్పుడు హీరోయిన్స్ గా నటిస్తున్నా ఎందరో హీరోయిన్స్ ఒకప్పుడు బాల నటులుగా నటించారు. అందులో ఒకప్పటి అందాల రాశి స్వర్గీయ శ్రీ దేవి మొదలు ఇటీవల హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ఉత్తేజ్ కూతురు చేతనా ఉత్తేజ్. ఇలా ఇంకా ఎందరు బాల నటులుగా నటించి హీరోయిన్స్ గా మారారో ఇప్పుడు చూద్దాం ..
అవికా గోర్
సూపర్ హిట్ సీరియల్ “బాలికా వధూ “ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ . తర్వాత హీరోయిన్ గా మారింది . రాజ్ తరుణ్ తో కలిసి ఉయ్యాలా జంపాల అనే సినిమాతో మంచి విజయం సాధించింది.
హన్సిక
దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయి విజయవంతమైన కెరీర్ ను సాగిస్తున్న నటి హన్సిక.హీరోయిన్ గా తెరంగ్రేటం చేయక ముందు హన్సిక ఎన్నో టీవీ కమర్సిల్స్ లో,సీరియల్స్,ఇంకా కోయి మిల్ గయా వంటి సినిమాల్లో బాల నటి గా నటించింది.
శ్వేతా బసు ప్రసాద్
కొత్త బంగారు లోకం సినిమాలో “ఎక్కడా..? ” అనే క్యూట్ డైలాగ్స్ తో కుర్రకారును తన మాయలో పాడేసుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఒకప్పుడు బాల నటి గా అనేక సినిమాల్లో నటించింది . మక్డీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనకు గాను జాతీయ పురస్కారం అనుకోవడం జరిగింది.
షామిలి
ఓయ్ సినిమాతో అందరిని ఆకట్టుకున్న షామిలి ఒకప్పుడు అనేక సినిమాల్లో బాలనటిగా నటించింది.నటి షాలిని చెల్లి ఈ షామిలి. అంజలి సినిమాలో షామిలి నటనకు గాను జాతీయ పురస్కారం తీసుకోవడం జరిగింది.
రాశి
బాల నటి గా ప్రస్థానం మొదలు పెట్టి హీరోయిన్ గా మారిన రాశి జన్మ స్థలం వెస్ట్ గోదావరి. మమతల కోవెల సినిమాలో మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది రాశి. హీరోయిన్ గా మరి అనేక సినిమాల్లో నటించిన రాసి బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి తో కూడా జతకట్టడం గమనార్హం.ఇప్పుడు కల్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది రాశి.
షాలిని
అలనాటి నటి షాలిని తన కెరీర్ ని “ente Mamattukkuttiyammakku” అనే మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తరువాత హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది.తమిళ స్టార్ హీరో అజిత్ ని ప్రేమ వివాహం చేసుకొని సినిమాల్లో నటించడం ఆపేసింది షాలిని.చైల్డ్ ఆర్టిస్ట్ గా షాలిని చివరి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి
మీనా
వెంకటేష్ చంటి సినిమాతో ఎంతో ప్రాచుర్యం పొందిన మీనా . కెరీర్ ఆరంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది .మీనా మొదటిసారిగా నెంజన్గల్ అనే తమిళ సినిమాలో 1982 లో బాల నటిగా నటించింది.రజిని కాంత్ , కమల్ హాసన్ సినిమాల్లో మొదట బాల నటిగా నటించి తర్వాత హీరోయిన్ గా కూడా నటించింది . మీనా రజినీకాంత్ నటించిన సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి.
శ్రీ దేవి
భారతీయ సినీ రంగంలో సంచలన తార శ్రీ దేవి కందన్ కరుణై (1967) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా బాల నటిగా నటించింది . తెలుగులో బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ కి మానవరాలుగా నటించింది . నటి గా మారిన తరువాత ఎన్టీఆర్ తో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించడం గమనార్హం . అలాగే మా నాన్న నిర్దోషి సినిమాలో కృష్ణ కి కూతురుగా నటించింది. నటిగా మారాక కృష్ణతో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.2018 లో దుబాయ్ లో శ్రీ దేవి తుది శ్వాస విడవడంతో అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు.