హీరోయిన్ రాధిక అన్నయ్య ఒకప్పటి స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా?
సినిమాల్లో హీరో హీరోయిన్స్ ని చూస్తే,వాళ్ళ వెనుక బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు,అసలు ఎలాంటి బ్యాక్ గురౌన్డ్ లేనివాళ్ళూ కనిపిస్తారు. అయితే కొన్ని కుటుంబాలు సినిమారంగాన్ని అంటిపెట్టుకుని రాణిస్తున్నవాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి, కొడుకు,బాబాయ్,సిస్టర్ ఇలా అందరూ ఆయా కేరక్టర్స్ లో ఒదిగిపోతూ రంగుల ప్రపంచంలో దూసుకుపోతుంటారు. ఇక తమిళం లోనే కాదు తెలుగు హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొంది,ప్రస్తుతం సీరియల్స్ లో కూడా బాగా బిజీగా ఉన్న నటి రాధికా శరత్. ప్రేక్షక హృదయంలో చెరగని ముద్రవేశారు.
ఇక రాధిక అన్నయ్య కూడా పెద్ద నటుడే. ఆయన పేరు రాధారవి.1953జులై 29న మద్రాసులోని రాజగోపాలం లో జన్మించారు.
తండ్రి ఎం ఆర్ రాధా ,తల్లి ధనలక్ష్మి అమ్మై. తండ్రి రాధా మంచి పేరుపొందిన నటుడు. తండ్రి సినీ రంగంలో ఉండగానే రాధారవికి ఎక్కువ ఆసక్తి ఉండడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. 1976లో మన్మధ లీలై సినిమాతో ఆరంగేట్రం చేసాడు. ఆ సినిమా లో నటనకు మెచ్చి పలువురు ఆయనతో సినిమాకు క్యూ కట్టారు. అలా ఈయన ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా , విలన్ గా నటించి మంచి గుర్తింపు పొందాడు.
బుల్లి తెరపై కూడా నటించిన ఈయన పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. ఇక రాధారవి తమిళం, కన్నడం, మలయాళం భాషా చిత్రాల్లో ఎక్కువ నటించాడు. ఈయన నటనకు వారిమూరై సోలివీడు సినిమాతో 2004లో బెస్ట్ కేరక్టర్ ఆర్టిస్ట్ గా తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నాడు.
2016లో బెస్ట్ కేరక్టర్ ఎడిషన్ అవార్డు కూడా పొందారు. ఇక దేశంలో ఊపందుకున్న మీటు ఉద్యమం ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాగా ఈయన తెలుగులో అశ్వమేధం అనే ఒకేఒక సినిమాలో నటించాడు.