Movies

అలనాటి స్టార్ హీరోయిన్ మాధవి డాటర్ ఇప్పుడు ఎలా ఉందో ఏమి చేస్తుందో చూస్తే దిమ్మ తిరగాల్సిందే

రంగుల ప్రపంచం సినీ రంగంలో ఎప్పుడు ఎవరు ఎలా మారతారో,అసలు ఈ ఇండస్ట్రీకి ఎలా వస్తారో,వచ్చాక జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ మాధవి సినీ రంగ ప్రవేశం అలానే జరిగింది. అనుకోకుండా స్కూల్స్ డేస్ లో అది కూడా 13ఏళ్ళ వయస్సులోనే సినీ రంగంలోకి ఎంటర్ అయింది. మొదటి సినిమా తూర్పు పడమర చిత్రం హిట్ అవ్వడంతో వరుస విజయాలు నమోదు చేసుకుని,మంచి పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది.ఈమెకు ముగ్గురు కూతుళ్లు. అందులో పెద్ద కూతురు అయితే మాధవి అందాన్ని మించిపోయి ఉందట. వారసత్వంగా సినిమాల్లోకి పంపిస్తుందా లేదా అనే దాని గురించి మల్లగుల్లాలు పడుతున్నారట.

మాధవి 1965 సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి గోవిందస్వామి,తల్లి శశిరేఖ. ఈమెకు ఒక అక్క,అన్న కూడా ఉన్నారు. భరతనాట్యం చిన్నప్పటి నుంచి నేర్చుకుని, 8ఏళ్ళ వయస్సు నుంచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టి,దాదాపు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె అబిడ్స్ స్కూల్ లో 8వ తరగతి చదువుతుండగా ఈమెను దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు చూసి, చూడడంతో సినిమా లో నటించాలని కోరారు.

అలా 13ఏళ్ళ వయస్సులోనే తూర్పు పడమర సినిమాతో ఆరంగేట్రం చేసిన మాధవికి ఆసినిమా ఊహించని విజయాన్ని అందించింది. ఇక వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. తెలుగు , తమిళ, కన్నడ,హిందీ ,మలయాళం,ఒరియా భాషల్లో నటించింది. మాధవి 17ఏళ్లపాటు సాగించిన సినీ జీవితంలో 300కి పైగా చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో మాధవి జోడీ కట్టడం హిట్ ఫెయిర్ గా నిల్చింది. చట్టానికి కళ్లులేవు,కోతలరాయుడి , ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,దొంగమొగుడు ఇలా ఎన్నో చిత్రాల్లో చిరంజీవితో కల్సి నటించింది.

ఇక చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా చెప్పే, ఖైదీ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి, తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది. అన్ని భాషల్లో కూడా అగ్రహీరోలతో కల్సి నటించింది. ఇక 1985 -90మధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. సినిమాల్లో మంచి జోష్ లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ శర్మను మాధవి వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.

వీరికి టిఫాని శర్మ,ప్రసిల్లా శర్మ,ఎవ్లీన్ శర్మ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు టిఫాని శర్మ బోస్టన్ లోని ప్రఖ్యాత కాలేజీ లో చదువుతోంది. అయితే ఆమె దగ్గర బంధువులు టిఫాని శర్మను చూసి, అమ్మాయి చక్కగా ఉంది, సినిమాల్లోకి పంపించవచ్చు కదా అంటున్నారట. అయితే చదువు పూర్తయ్యాక తనకు ఏది కావాలో అది తను నిర్ణయించుకుంటుందని మాధవి అంటోంది. ఇక ఈమె కనుక ఇండస్ట్రీలోకి అడుగుపెడితే మాధవి కెరీర్ ని సైతం అధిగమిస్తుందని అంటున్నారు.