Politics

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గురించి కొన్ని విషయాలు

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను జూన్ 2వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయి నవ్యాంధ్రగా ఏర్పడిన తరువాత 30-10-2014న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు నవంబరు 1 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవమును జరుపుకునేవారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయి జూన్ 2న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అందువలన అదే తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది – అక్టోబరు 1, 1953
ఆంధ్రరాష్ట్రం తెలంగాణాతో కలిసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది – నవంబరు 1, 1956
జూన్ 2 2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నవ్యాంధ్ర , తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు