జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు రోజులు వచ్చి పకపకలతో కితకితలు పెట్టి ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేట్టు చేస్తుంది.. ఇది కిర్రాక్ కామెడీ షో…యాక్టర్లు తమ పంచ్‌లతో నవ్వులు పూయిస్తారు… కామెడీతో కేక పుట్టిస్తారు… చూసేవాళ్లు బాధలు మర్చిపోయి నవ్వుల్లో మునిగితేలుతున్నారు.
ఈ ప్రోగ్రామ్ చూసి నవ్వుతో లవ్వులో పడిపోయారు లక్షలమంది… నవ్వుకే నవ్వు తెప్పిస్తుంది ఈ ప్రోగ్రామ్…సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ టీవీ ప్రోగ్రామ్ ఇది…శుక్రవారం వచ్చిందంటే చాలు… జనం అన్నిపనులు ముగించుకుని రాత్రి తొమ్మిదిన్నరకల్లా టీవీ ముందు సెటిలైపోతున్నారు…
ఈ ప్రోగ్రామ్ ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇవ్వడంతో పాటు రేష్మి, అనసూయలకు కూడా లైఫ్ ఇచ్చింది.. బుల్లి తెర నుంచి పెద్ద తెరకు వెళ్లేలా చేసింది..ఏయే కమెడియన్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో చూద్దాం…జబర్దస్త్ స్టార్ కమెడియన్ అయిన చమ్మక్ చంద్రకు ఒక్కో షోకి 2.5 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఇస్తారు.. సుడిగాలి సుధీర్‌కి కూడా 2.5 నుంచి 3 లక్షల దాకా ఇస్తారు..సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చి నటుడయిప అదిరే అభికి కూడా 2.5 నుంచి 3 లక్షల దాకా ఇస్తారు…షకలక శంకర్‌కి కూడా 3 లక్షల దాకా పారితోషికం ఇస్తారు…
జబర్దస్త్ వేణుకి కూడా 3 లక్షల దాకా ముడుతుంది…. జబర్దస్త్‌తోనే కెరీర్ ప్రారంభించిన ఆటోపంచ్‌ల రాంప్రసాద్‌కి ఒక్కో షోకి లక్ష నుంచి లక్షా 80 వేల రూపాయల వరకు ఇస్తారు….జబర్దస్త్ కమల్‌హాసన్‌గా పేరు తెచ్చుకున్న గెటప్‌శీనుకు కూడా లక్ష నుంచి లక్షా 80 వేల రూపాయల దాకా ఇస్తారు….మిగిలినవాళ్లకు కూడా బాగానే ముట్టచెబుతున్నారు… ఇక జడ్జీలు కూడా బాగానే వెనకేసుకుంటున్నారుట. ఇలా ఈ కిర్రాక్ కామెడీ షోతో అందరు బాగానే సంపాదిస్తున్నారు… జనాన్ని నవ్వుల్లో ముంచి పంచ్‌లతో పైసలు పోగేస్తున్నారు.