Movies

రాజశేఖర్-సుమన్ గొడవ వెనక ఎవరు ఉన్నారో తెలుసా?

విలక్షణ నటుడు సాయికుమార్ ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్’ ప్రోగ్రామ్ లో తన కెరియర్ అనేక ఆ శక్తికర విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చాడు. ఇదే సందర్భంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా తాను పడ్డ బాధలను వివరించాడు సాయికుమార్. సినిమా రంగంలోని ఇగోల సమస్య గురించి కామెంట్ చేస్తూ ఒకప్పుడు తాను ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన హీరోలు రాజశేఖర్ – హీరో సుమన్ ల మధ్య తాను ఎలా నలిగిపోయింది వివరించాడు సాయి కుమార్.

అప్పట్లో రాజశేఖర్ – సుమన్ ఇద్దరికీ సాయి కుమార్ వాయిస్ ఇవ్వడం అనేది చిత్రమైన విషయం. ‘ముందు నేను సుమన్ కే డబ్బింగ్ చెప్పేవాణ్ని. ఐతే టి.కృష్ణగారి వందేమాతరం సినిమాలో సుమన్ – సుహాసిని హీరో హీరోయిన్లని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో సుమన్ జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో రాజశేఖర్ ను తీసుకున్నారు. రాజశేఖర్ కు ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ డబ్బింగ్ చెప్పాడు.

కానీ అతడి వాయిస్ నచ్చక కృష్ణగారు నన్నే చెప్పమన్నారు. చెప్పారు. ఆ వాయిస్ బాగా పాపులర్ అయింది. రాజశేఖర్ తర్వాతి సినిమాలకు కూడా నన్నే కంటిన్యూ కమ్మన్నారు. తర్వాత సుమన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినపుడు తనకు డబ్బింగ్ చెప్పొద్దని గొడవ పెట్టాడు.

రాజశేఖర్ కూడా స్టార్ ఇమేజ్ సంపాదించి.. తనకు మాత్రమే డబ్బింగ్ చెప్పాలని సుమన్ కు వద్దని అన్నాడు. ఐతే మా అమ్మ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఇద్దరికీ కొంచెం వేరియేషన్ తో నేను డబ్బింగ్ చెప్పేలా ఒప్పించింది’’ అని సాయికుమార్ వెల్లడించాడు.