Movies

డబ్బుండి కూడా ఛాయాదేవికి చివరిలో ఎంత కష్టం వచ్చిందో చూడండి…. నమ్మలేని నిజాలు

తెలుగు సినిమా పరిశ్రమలో సూర్యకాంతం,ఛాయాదేవి కాంబినేషన్ అంటే తెలుగు జనాలకు పండగే. వాళ్లిద్దరూ సినిమాలో ఉంటె ఇక చూడక్కర్లేదు. తిట్ల పురాణంతో జనానికి వినోదం పంచిన జోడీ. అయితే సినిమాలో అలా వున్నా బయట భలే సరదా గా ఉండేవారట. ఇక ఛాయాదేవి జీవిత విశేషాలు చూస్తే, గుంటూరు దగ్గర ఓ పల్లెటూరిలో చౌదరి కుటుంబంలో పుట్టిన ఛాయాదేవికి చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. భర్త చనిపోవడంతో ఇంట్లో అన్నదమ్ముల టార్చర్ భరించలేక ఇల్లు వదిలేసి విజయవాడ వచ్చేసింది. అక్కడ ఓ డ్రామా కంపెనీలో డాన్స్ లు చేసేది. ప్రముఖ కేరక్టర్ ఆర్టిస్టు నిర్మలమ్మ తో కల్సి ఊరూరా తిరిగి డాన్సులు చేసేవారు.

అలా డాన్సులు చేస్తుంటే,పాతూరి సుబ్బారావు అనే కొంచెం దర్జాగా ఉండే బ్రాహ్మణుడు ఛాయాదేవిని సినిమాల్లో చెరిపిస్తానని మద్రాసు తీసుకెళ్లి, అక్కడా ఇక్కడా తిరిగి వేషాలు ఇప్పించేవాడు. సరిగ్గా అదేసమయంలో ఎన్టీఆర్ పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు వంటి సినిమాలు తీస్తుండంతో ఛాయాదేవి నటన చూసి, మెచ్చుకుంటూ వేషాలు ఇచ్చారు. ఇక సూర్యకాంతం కాంబినేషన్ లో బాగా క్లిక్ అవ్వడంతో పరిశ్రమలో ఛాయాదేవి నిలదొక్కుకుంది.

అందరినీ దడదడ లాడిస్తూ, ఎవరినీ లెక్కచేయకుండా ఉండేది. ఎస్వీ రంగారావును రంగు అనేది. ఆయన కూడా ఛాయాదేవికి బోడి టింగు అని పేరు పెట్టాడు. డబ్బు సంపాదన పెరగడంతో మద్రాసు త్రిమూర్తి స్ట్రీట్ లో పెద్ద ఇల్లు కట్టింది. ఓ అంతస్తులో ఛాయాదేవి ఉండేది. ఓ పోర్షన్ లో సిల్క్ స్మిత,మరో పోర్షన్ లో కామెడీ యాక్టర్ కల్పనారాయ్ కి అద్దెకిచ్చింది. ఇక ఇంకో పెద్ద పోర్షన్ ఉంటె దాన్ని ప్రముఖ నిర్మాత తిరపతయ్యకు అద్దెకివ్వడంతో అక్కడ ఆఫిసు పెట్టారు. కృష్ణావతారం సినిమా తీస్తూ ఛాయాదేవిని పిలిచి బ్యాంకు కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాను అప్పు ఇవ్వమని అడిగాడు.

అలా ఇచ్చిన సొమ్ముతో కృష్ణావతారం తీసాడు. సినిమా కూడా హిట్ అవ్వడంతో వడ్డీ, అసలు కూడా తీర్చాడు. అలా తిరపతయ్యకు ఛాయాదేవి ఫైనాన్స్ చేసేది. చెల్లింపులు సక్రమంగా సాగేవి. కొన్నాళ్ళకు తిరుపతయ్య చనిపోవడం ఆఫీసు తీసేయడం జరిగాయి. అయితే తిరుపతయ్య కొడుకు దేవీ వరప్రసాద్ కి చివరి వరకూ ఛాయాదేవి డబ్బు ఇస్తూనే ఉండేది. ఆయన ఎన్టీఆర్, చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తీసాడు. వడ్డీ కూడా సక్రమంగానే చెల్లించేవాడు.

ఇక ఛాయాదేవికి ఓ పెంపుడు కూతురు ఉండేది. వయస్సు మీద పడడంతో పాటు షుగర్ వ్యాధి సోకడంతో ఛాయాదేవికి ఒక కాలు తీసేసారు. మంచం మీద ఉండేది. పాతూరి సుబ్బారావు ఆమె బాగోగులు చూసేవాడు. వడ్డీలు, అద్దెలు వచ్చేవి. కొన్నాళ్ళకు ఛాయాదేవి మరణించడంతో ఆమె మేనల్లుడి నంటూ ఒకతను వచ్చి ఆస్థి గురించి కోర్టుకు వెళ్ళాడు. నిర్మాత దేవీ వరప్రసాద్ కూడా తనకు ఛాయాదేవి బాకీ పడిందని,అందుకే వాటా ఇవ్వాలని కేసు వేసారు. మొత్తానికి పెంపుడు కూతురు, మేనల్లుడు, నిర్మాత ఇలా ముగ్గురికీ ఆస్థి పంచుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. అందరూ ఉండికూడా ఎవరూ లేనట్టు చివరి రోజుల్లో బతికింది ఛాయాదేవి.