Movies

సౌందర్య మరణం తర్వాత ఆమె డబ్బుతో భర్త ఏమి చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

చిలిపితనం,,రౌద్రం,ఆనందం,క్రోధం,రోషం,ఆవేశం,కామెడీ ఇలా సీను ఏదైనా పండించడంలో మహానటి సావిత్రి తర్వాత ఆమెని మరపించే అతికొద్ది మంది హీరోయిన్స్ లో సౌందర్య ఒకరని చెప్పొచ్చు. అందం,అభినయం తో పాటు సిస్టామేటిక్ సినీ లైఫ్ ఆమె సొంతం. ఆమె కట్టే చీరలకు సౌందర్య బ్రాండ్ చీరలని మార్కెట్ ని ఊపేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్స్ తో పోలిస్తే,సౌందర్య తీరేవేరు. సినిమా అన్నాక అప్పుడపుడు మోడ్రన్ డ్రెస్సుల్లో అలరించినప్పటికీ,చీరకట్టు ఆమెకే సొంతం అన్నట్టు ఉండేది. ఇక సినిమాల్లో ఆమె సంపాదించిన సొమ్ము ఎక్కువే. చిన్నవయస్సులోనే ఈలోకం నుంచి నిష్క్రమించిన నటి సౌందర్య.

సౌందర్య తాను సంపాదించిన సొమ్ముతో ట్రస్ట్ లు పెట్టి ఎందరినో ఆడుకుంది. అయితే రఘు అనే వ్యక్తిని పెళ్లాడిన సౌందర్య, ఆతర్వాత సినిమాల్లో కూడా మెల్లిగా తగ్గించడం మొదలుపెట్టింది. బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో సినిమాలకు ప్రాధాన్యం తగ్గించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇటు ప్రేక్షకులు,అటు కుటుంబం విషాదంలో మునిగారు. భర్తతో పాటు తల్లి శోకంతో తల్లడిల్లారు. అయితే 2010లో ఓ డాక్టర్ ని రఘు పెళ్ళాడి,జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాడు.

తల్లిని కూడా కాదని ఆస్తి మొత్తం భర్త పేరిట పెట్టడంతో తల్లిని గాలికొదిలేసి,రఘు అతడి రెండో పెళ్ళాం దేశవిదేశాల్లో తిరుగుతూ జల్సా చేస్తున్నారు.
కాగా ఆరోజుల్లో సౌందర్య కేవలం స్టార్ హీరోల సినిమాల్లోనే కాదు, చిన్న హీరోలు, చిన్న సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఎవరికైనా షెడ్యూల్ డేట్స్ ఇచ్చేటప్పుడు, హీరోతో నిమిత్తం కాకుండా, కేవలం తన పాత్ర ఎలాంటిదో తెసులుకుని ఖరారు చేసేది. అందుకే బాబు మోహన్ లాంటి వారితో సైతం స్టెప్పులేసింది.

అయితే ఐటెం సాంగ్ లకు పూర్తిదూరం పాటించింది. సంపాదించిన సొమ్ముని భర్త పేరుతొ పెట్టడమే కాకుండా కొన్ని ట్రస్ట్ లు పెట్టింది. అయితే ట్రస్ట్ కి సంబంధించిన లావాదేవీల విషయంలో సక్రమంగా పన్నుల చెల్లింపులు ఆపేయడంతో అవి కాస్తా మూతపడే పరిస్థితికి చేరాయి. సౌందర్య లేనప్పుడు ఇక ఆమె భర్తను అడిగే ధైర్యం ఎవరికుంటుంది. అయ్యో పాపం అనుకోవడం తప్ప.