Politics

మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఎప్పుడు రాజకీయం ఎటు మారుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో అయితే ఉదయం ఓ పార్టీలో చేరి సాయంత్రానికి మరో పార్టీ గూటికి వచ్చేస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ తో కొన్ని పార్టీలు పొత్తుపెట్టుకుని మహా కూటమిగా అవతరించాయి. అందులో టిడిపి కూడా ఉంది.

ఇక అధికార టిఆర్ ఎస్ పార్టీ అయితే దాదాపు కొన్ని టికెట్లు మినహా అన్నింటిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇబ్రహీం పట్నం నుంచి టి ఆర్ ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం జారబోయే ఎన్నికల్లో టికెట్స్ కోసం వేచిచూసిన ఈయనకు టికెట్ దక్కలేదు. ఇక ఆయన టిడిపి వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీ బలంగానే ఉంది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారయింది. అందుకే చంద్రశేఖర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లి టికెట్ తెచ్చకుని పోటీచేయాలని భావిస్తున్నారు.

ఇంతకీ చంద్రశేఖర్ రెడ్డి ఎవరంటే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామగారు. అదేనండి బన్నీ భార్య స్నేహారెడ్డి ఫాథర్. అందుకే టిడిపి టికెట్ చంద్రశేఖర్ రెడ్డికి కన్ఫర్మ్ అయితే మామ గారి పేరిట బన్నీ ప్రచారం చేస్తారని అంటున్నారు. ఈవిధంగా బన్నీ టిడిపి వైపు మొగ్గినట్లేనని అంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో ఇది కొంచెం ఇబ్బంది పెట్టె అంశమే.

ముఖ్యంగా జనసేన పార్టీతో జనంలోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ టిడిపి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ టిడిపికి కొమ్ము కాస్తే పవన్ మాటెలా ఉన్నా, అభిమానులు మాత్రం జీర్ణించుకోలేరు.