హీరో వినీత్ గుర్తు ఉన్నాడా… వినీత్ అక్క తెలుగు టాప్ హీరోయిన్… ఆమె ఎవరో తెలుసా?

ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన వినీత్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. ఇతని అసలు పేరు వినీత్ రాధాకృష్ణ. 1969ఆగస్టు 23న కేరళలో జన్మించాడు. ఇతని తండ్రి కెటి రాధాకృష్ణన్,టికే శాంత కుమారి. 1985లో మలయాళంలో వచ్చిన ఇదాని లంగళ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత ప్రణామం మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. 1992లో అవరంపు అనే సినిమాతో తమిళ తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాకు బెస్ట్ న్యూ పేజ్ అవార్డు అందుకున్నాడు.

ఇక తెలుగులో 1994లో సరిగమలు మూవీతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన వినీత్,ఆతర్వాత ఆరోప్రాణం,ఏవండీ పెళ్లిచేసుకుందాం,ప్రేమ పల్లకి,రుక్మిణి,పాడుతా తీయగా, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్,ప్రేమించాలని ఉంది,ప్రేమదేశం వంటి సినిమాల్లో నటించాడు. 2006లో థాంక్స్ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. ఇక 2004లో ప్రిసిల్లా మీనన్ ని పెళ్లిచేసుకున్నాడు. వీరికి 2006లో అవంతి అనే కూతురు జన్మించింది. తెలుగుకి దూరమైనా మలయాళ, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇక విక్రమ్ సినిమా ద్వారా నాగార్జునతో కల్సి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శోభన మంచి డాన్సర్ కూడా. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడమే కాకుండా,డాన్సర్ గా వేలాది ప్రదర్శలు ఇచ్చిన ఈమెకు వినీత్ సోదరుడే. అలాగే వినీత్ మేనత్త ఒకప్పుడు బెస్ట్ యాక్టర్. ఆమె పేరు సుకుమారి. ఆరేళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

ముఖ్యంగా బామ్మ వేషంలో అదరగొట్టేసాడు. ఈమెకు 2003లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈమె పూజ గదిలో పూజ చేస్తుండగా,ఆమె చీరకు దీపం అంటుకుని తీవ్రంగా గాయపడింది. ఆతర్వాత ఆందోళనతో నెలరోజుల్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది.