Movies

S.P. బాలు కొడుకు తండ్రి పేరును నిలబెట్టాడా? ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

తల్లిదండ్రులు మంచి స్థితిలో ఉంటే పిల్లలు అదే రేంజ్ లో ఉండాలని కలలు కంటారు. మాములుగా ఉన్నవాళ్లు కూడా తమ పిల్లలు పై స్థాయికి ఎడాగాలని ఆకాంక్షిస్తారు. కానీ పిల్లల్ని కంటారు కానీ, వాళ్ళ తలరాతలు రాయలేరు కదా. పిల్లలు చేసే తప్పుల వలన మంచి స్థాయిలో ఉన్న పిల్లలు ఇబ్బందుల పాలవుతారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కూడా దెబ్బతింటాయి. సరిగ్గా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విషయంలో అదే జరిగింది. కొడుకు వలన ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. అయితే పరిస్థితి చేయిదాటకముందే జోక్యం చేసుకుని వివాదం సర్దుమణిగేలా చేసారు.

సంగీత సాధన అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పాటలు పాడాలని చాలామందికి ఉన్నా,అదీ కుదరదు. ఎందుకంటే చక్కని గొంతు,సంగీతం పట్ల అభిరుచి,పాడాలని కోరిక బలంగా ఉండాలి. మన తెలుగులో గాన గంధర్వులు ఎందరో ఉన్నారు. అందులో ఎస్పీ బాలు ఒకరు. రాతి గుండెలను సైతం కరిగించే అమృతం ఈయన గొంతులో ఉంది. ఈయనకు ఇద్దరు పిల్లలు.

సంగీతం అంటే వల్లమాలిన అభిమానం గల బాలు కొడుక్కి చరణ్, కూతురికి పల్లవి అనే పేర్లు పెట్టుకున్నారు. ఇక ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా సింగర్. ఆ విధంగా బాలు ది సంగీత కుటుంబం.బాలు కొడుకు చరణ్ కూడా మంచి సింగర్. చిన్నప్పటి నుంచి పాటలు పాడే చరణ్,మంచి గాయకుడే కాకుండా యాంకర్,ప్రొడ్యూసర్, నటుడు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ గుడుంబా శంకర్ లో ‘చిగురాకు చినుకు’అల్లు అర్జున్ గంగోత్రిలో ‘గంగా’,నాగ్ మన్మధుడిలో ‘నేను నేనుగా’,వంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ చరణ్ పాడారు.

పలు తమిళ చిత్రాల్లో నటుడిగా రాణించి, కేపిటల్ ఫిలిమ్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి,పలు సినిమాలు తీసి , ఆస్తి మొత్తం పోగెట్టారు. ఇక కె బాలచందర్ కొడుకు సలహాతో టివి రంగంలోకి అడుగుపెట్టాడు. తెలుగులో అక్కా చెల్లెల్లు సీరియల్ లో నటించాడు. తమిళ సీరియల్ లో కూడా నటించాడు.

కెరీర్ బానే కొనసాగుతున్న సమయంలో పెళ్లిచేసుకున్న చరణ్ కి కొద్దిరోజుల్లోనే భార్యతో విడాకులు వచ్చేసాయి. ఆతర్వాత రెండో పెళ్ళికి ఒప్పుకున్న సమయంలో పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ పార్టీలో సోనా హేడన్ అనే అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అసభ్యంగా మాట్లాడుతూ సెక్స్ హెరాస్ మెంట్ చేసాడు. చెన్నై కమీషనర్ దగ్గరకు కేసు చేరడంతో చరణ్ అరెస్టు అయ్యాడు. బెయిల్ పై బయటకొచ్చాక ఫ్రెండ్ తో కల్సి మళ్ళీ సోనాను బెదిరించడంతో మరోసారి కేసు పెట్టేసింది. ఇక బాలు జోక్యం చేసుకుని, సోనాకు కొడుకుతో క్షమాపణ చెప్పించడంతో వివాదం పెద్దదిగా కాకుండా ఆగింది.