Movies

సవ్యసాచి సినిమాలో నాగ చైతన్యతో జోడి కట్టిన నిధి అగర్వాల్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

కొందరు హీరోయిన్స్ కి అనుకోకుండా ఛాన్స్ లు వచ్చిపడతాయి. మరికొందరైతే ఎంత ట్రై చేసినా ఛాన్స్ లు రావు. ఇంకొందరు వరుస విజయాలను కూడా అందుకుంటారు. స్టార్ హీరోయిన్ తక్కువకాలంలోనే అవుతారు. సరిగ్గా ఇప్పుడు నిధి అగర్వాల్ ని చూస్తే, అందరికీ అదే అనిపిస్తోంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తానేమిటో నిరూపించుకుంటోంది. ఈమె హైదరాబాద్ లో పుట్టినా,ఆమె ఫామిలీ బెంగుళూరులో సెటిల్ అయింది. బిజినెస్ మేనేజ్ మెంట్ డిగ్రీ చేసిన నిధి అగర్వాల్,కథక్,బెల్లి డాన్సులలో ప్రవేశం ఉంది.

నిధి తండ్రి రాజశేఖర్ అగర్వాల్, తల్లి ఇందు అగర్వాల్. సినిమాల్లో చేయాలన్న కోరిక బయట పెడితే,మనకు ఫీల్డ్ లో తెలుసున్నవాళ్ళు ఎవరూ లేరు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్తే ఇబ్బందే అంటూ పేరెన్స్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. అయితే మోడలింగ్ చేస్తే సినీ ఛాన్స్ లు ఆటోమేటిక్ వస్తాయని ఫ్రెండ్స్ చెప్పడంతో ముంబాయి వెళ్లిన నిధి అగర్వాల్ అక్కడ మోడలింగ్ లో చేసింది.

దీంతో డైరెక్టర్ షబ్బీర్ ఖానా చూసి మున్నా మైఖేల్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. 2017లో వచ్చిన అది కమర్షియల్ గా హిట్ అయింది. నిధికి కూడా పేరొచ్చింది. అభిమానులు ఏర్పడ్డారు. అంతేకాదు చేసింది ఒక్క సినిమాయే అయినా ఈమె ఎక్స్ పోజింగ్ కి నో చెప్పదన్న పేరు కొట్టేసింది.
అలా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ తక్కువ సమయంలోనే పాపులారిటీ,అభిమానం పొందింది. ఇక ఏడాదిలోనే తెలుగులోకి కూడా వచ్చి చేరింది.

తెలుగుతో సవ్యసాచి మూవీతో ఎంట్రీ ఇస్తున్న ఈమె మరో సినిమాలో కూడా చేస్తోంది. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న సవ్యసాచిలో గ్లామరస్ గా,ఎక్స్ పోజింగ్ గా ఆమె స్టిల్స్ దర్శనమిస్తున్నాయి. ఈమూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన నటిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు నాగచైతన్య తమ్ముడు అఖిల్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అఖిల్ నటించే మిస్టర్ మజ్ను మూవీలో నిధి హీరోయిన్ గా ఎంపికయింది. ఇలా ఆమె నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో రాకముందే ఏకంగా రెండు సినిమాల్లో అందునా అన్నదమ్ముల సినిమాల్లో చేస్తుండడం నిజంగా విశేషమే.