జనసేన అధినేత పవన్ కి తల్లి అంజనాదేవి ఇచ్చిన విరాళం ఎవరి డబ్బు తెలుసా?
గత ఎన్నికల ముందు జనసేన పార్టీని లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, బిజెపి,టిడిపిలకు సపోర్ట్ చేస్తూ విస్తృత ప్రచారం చేసారు. అయితే ఈసారి ఎన్నికల బరిలో దిగాలని బలంగా సంకల్పం చేసుకుని ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ‘సీఎం సీటు ప్రధానం కాదు. మార్పు రావాలి. నా ఆశ ఆశయం మీద ఉంటుంది. పదవి మీద కాదు. సీఎం అవ్వాలన్న ఆశతో రాజకీయాల్లోకి రాలేదు. ఒకవేళ అలా వస్తే వేరుగా ఉండేది. వేలకోట్ల పెట్టుబడితో రాజకీయాల్లోకి రాలేదు నేను. ఒక్కొక్కసారి వైసిపి,టిడిపి కుమ్మక్కు అవ్వచ్చేమో గాని,జనసేన ప్రజల తరపున పోరాడుతుంది. అందుకే ఈ పార్టీ పుట్టింది”అని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేసారు.
పవన్ కళ్యాణ్ కి ఫుల్ సపోర్ట్,ఇంకా చెప్పాలంటే పవన్ తల్లి అంజనాదేవి అండగా నిలిచారు. జనసేన కార్యాలయానికి వచ్చిన ఆమె కొడుకు పార్టీకి విరాళంగా 4లక్షల రూపాయలు చెక్కు రూపంలో అందించారు. నిజానికి జనసేన బలం రోజురోజుకీ పుంజుకుంటోంది. ఇతర పార్టీల నుంచి నేతలు క్యూ కడుతున్నారు. మహిళలు,యువత కోసం పవన్ ఎన్నో ప్రసంగాలు ఇస్తూ ఉత్తేజపరుస్తున్నారు.
యువతకు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పిస్తామని, మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చూస్తామని పవన్ అంటున్నారు. ఇక పార్టీ నడవాలంటే విరాళం అవసరం. మొన్నటికి మొన్న పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సాయి తేజస్విని అనే 12ఏళ్ళ విద్యార్థిని జనసేన మీద అభిమానంతో తాను దాచుకున్న 13వందల రూపాయలను పార్టీ విరాళంగా అందించింది.
అయితే అందులోంచి కేవలం 11రూపాయలు మాత్రమే తీసుకుని మిగిలిన సొమ్ము సదరు విద్యార్థినికి ఇచ్చేసి ఆశీర్వదించారు. ఇక పవన్ తల్లి జనసేన కార్యాలయంలోకి అడుగుపెట్టి కార్యాలయం మొత్తం కలియదిరిగి సందడి చేసారు. తల్లి అన్నీ దగ్గరుండి చూపించారు పవన్.
తల్లి ఇచ్చిన నాలుగు లక్షల రూపాయల విరాళం స్వీకరించి,తల్లినుంచి ఆశీర్వాదం అందుకున్నారు. అయితే అంజనా దేవి ఇచ్చిన సొమ్ము ఎవరి దగ్గరా అడిగింది మాత్రం కాదు. కేవలం తన భర్త సొమ్మునే ఇలా అందించింది.