Movies

ఈ నటుడు బ్యాక్ గ్రౌండ్,అతనికున్న ఆస్థి గురించి తెలిస్తే షాకవుతారు…నమ్మలేని నిజాలు

సినిమాల్లో సపోర్టింగ్ కేరక్టర్స్ వేసే వాళ్లకు ఉండే గుర్తింపు మాములుగా ఉండదు. వీళ్ళు హీరోలతో సమానంగా వెలిగిపోతుంటారు. హీరోలకు ఒక సినిమా అయితే వీళ్లకు ఆరు సినిమాలు ఉంటాయి. అదే వీళ్ళ టాలెంట్. ఇక అలాంటి ఓ కేరక్టర్ ఆర్టిస్టు విషయంలోకి వెళ్తే,’ఓ నాన్న,ఓ అమ్మ,ఓ కూతురు- అదే స్టోరీ ఇదే ట్విస్ట్’అంటూ తెలుగు జనాల్ని కడుపుబ్బా నవ్వించిన సూర్య భగవాన్ దాస్ గుర్తున్నాడా? 35ఏళ్లుగా పరిశ్రమలో తనదైన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. స్టార్ హీరో నాగార్జున తొలిచిత్రం విక్రమ్ తోనే యితడు తెరంగేట్రం చేసాడు. మన భాష కాదు,బ్యాక్ గ్రౌండ్ లేదు అయినా ఎంట్రీ ఇచ్చి నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. అయితే కెరీర్ మొదట్లో ఇతన్ని మొహం చూడలేక తర్వాత చూద్దాం,వెళ్ళిపో అంటూ అందరూ చీదరించుకునేవారట. ఈవిధంగా ఎన్నో బాధలు,కష్టాలు అధిగమించి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకున్నాడు.

సూర్య తండ్రి పేరు కలొలియన్ భగవాన్ దాస్ , తల్లి పేరు ప్రభావతి. ఇద్దరూ ఆర్మీలో ఉద్యోగులే. తండ్రికి హైదరాబాద్ బదిలీ అవ్వడంతో సూర్య చిన్నప్పుడు అక్కడే పెరిగాడు. చిన్న నాటినుంచి నటనలో అభిలాష గల యితడు డిగ్రీ చేసే రోజుల్లోనే మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. ప్రేమించు,జననీ జన్మ భూమిశ్చ వంటి సీరియల్స్ లో నటించిన సూర్య మంచి గుర్తింపుతో పాటు నంది అవార్డు కూడా అందుకున్నాడు.

ఆ తర్వాత విక్రమ్ తో వెండితెరకు వచ్చిన సూర్య కు మళ్ళీ పదేళ్లు ఎలాంటి ఛాన్స్ లు దక్కలేదు. ఆతర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో సింధూరం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. సింధూరం లో ఆయన యాక్టింగ్ కి జనం ఫిదా అయ్యారు. అవకాశాలు కూడా వరుస పెట్టి వచ్చాయి. సినిమాలు ఛాన్స్ లకోసం కష్టాలు పడ్డాడు తప్ప ఆర్ధికంగా ఏనాడూ సూర్య కష్టాలు ఎదుర్కోలేదట. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమకు వేళయరా మూవీలో కామెడీ ఆర్టిస్టుగా చేసిన యాక్టింగ్ సూపర్.

ఓ డిటెక్టివ్ గా ఊహించుకుంటూ ‘ఓ అక్క,ఓ బావ,ఓ కూతురు’అంటూ అర్ధం పర్ధం లేని డైలాగ్స్ తో జనాల్ని నవ్వించాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఓ డాక్టర్ గా ఆయన చేసిన యాక్టింగ్ అదిరింది. ఇక ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘భరత్ అను నేను’లో సీనియర్ జర్నలిస్ట్ పాత్ర పోషించిన సూర్య భగవాన్ దాస్ కథను మలుపు తిప్పే పాత్రలో మెప్పించాడు. అన్న,బావ, తండ్రి,వంటి పాత్రలతో ఇప్పటివరకూ దాదాపు 150సినిమాల్లో నటించిన సూర్య అందరి మెప్పు పొందాడు. ఇక ఇతని బ్యాక్ గ్రౌండ్ చూస్తే, హైదరాబాద్ కి వచ్చిన కొత్తలోనే స్కూల్ స్థాపించాడు. ఎన్నో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ధనవంతుడు అయినా, సినిమా కష్ఠాలు త