నూతన్ ప్రసాద్ కోసం భార్య – కొడుకు చేసిన త్యాగాలు మరెవ్వరూ చేయలేరు…నమ్మలేని నిజాలు
తెలుగు చిత్రసీమ విచిత్రమైనది. అన్నీ బాగుంటే, ఆకాశానికి ఎత్తేస్తారు, తేడా జరిగితే అటువైపు కన్నెత్తి చూడరు. బాగున్నప్పుడు పరిశ్రమలో ఎలా చూస్తారో,అదే బాగోలేనప్పుడు ఎవ్వరూ కనీసం పలకరింపునకు కూడా రారో చవిచూసిన నటుడు నూతన్ ప్రసాద్. నూటొక్క జిల్లాల అందగాడిని అని సగర్వంగా ప్రకటించుకుని, తన కంచు కంఠంతో డైలాగ్ మాడ్యులేషన్ లో తిరుగులేని నటుడిగా నిరూపించుకున్న నూతన్ ప్రసాద్ నటన అంటే మనం సృష్టించుకునేది కాదు ఇది రాజకృప అని మనసారా నమ్మారు. జీవితం అంధకారం అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన నటుడు నూతన్ కి మరో నటుడు సాటిరాడు. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్ లో ఒకే చేయడం ఈయనకే చెల్లింది.
1200 షాట్ ఒకే టేక్ లో ఒకే చేసి,ఆరోజుల్లో రికార్డు క్రియేట్ చేసారు. 1984లో సుందరి సుబ్బారావు చిత్రంలో సహాయ నటుడిగా నంది అవార్డు,2005లో ఎన్టీఆర్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. నూనూగు మీసాల వయసులో మీసాలు కనిపించకపోవడంతో మసిబొగ్గుతో మీసాలుగా తీర్చిదిద్దుకుని,నారా విగ్గులు తయారు చేసికుని,అమ్మ కు తెలీకుండా దాచిన దొంగ చీరను కట్టుకుని శ్రీకృష్ణుని వేషంతో రక్తికట్టించి, అప్పట్లో 25రూపాయల రెమ్యునరేషన్ అందుకుని నూతన్ ప్రసాద్ పరవశించిపోయారు.
ఈయనను చూసినా, చూడకపోయినా ఈయన ఫ్రెండ్స్ ఉండలేకపోయేవారట. అంతగా వారితో పెనవేసుకున్న నూతన్ కి ఎట్టకేలకు బాపు రమణల ఆశీస్సులతో 1973లో అందాల రాముడు చిత్రంతో దశ తిరిగిపోయింది. అప్పటివరకూ వర ప్రసాద్ గా చలామణీ అయిన వ్యక్తి నూతన్ ప్రసాద్ అయ్యాడు. 1975లో ముత్యాల ముగ్గు మూవీతో నిత్యపెళ్లికొడుకుగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 1978లో మూడో సినిమాగా చలిచీమలు చిత్రంలో వేసిన వేషం మంచి గుర్తింపు తెచ్చింది.
అదే ఏడాది ప్రాణం ఖరీదులో నటించారు. ఆతర్వాత రాజాధిరాజా , తాతయ్య ప్రేమలీలలు,పట్నం వచ్చిన ప్రతివ్రతలు,ఖైదీ,మా ఇంటి ప్రేమాయణం, మగమహారాజు, బొబ్బిలి బ్రహ్మన్న,తదితర చిత్రాలతో ఓ ఊపు ఊపేసాడు. ఇక ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో హీరోగా రక్తికట్టించారు.ఇక 2000 సంవత్సరంలో నువ్వు వస్తావని,2005లో సదా మీ సేవలో వంటి చిత్రాల్లో నూతన్ ప్రసాద్ నటన అద్వితీయం. రమాప్రభ సరసన ఇంటింటి రామాయణంలో నటించిన రిక్షావాడి పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పాండి బజార్ పక్క సందులో నూతన్ ప్రసాద్ నివాసం ఉండేది. మేడమీద పరుచూరి బ్రదర్స్ ఉండేవారు. దీంతో ఆ ఇల్లు ఎప్పుడూ గానాబజానాతో కళాకారులతో సందడిగా ఉండేది. ఇక రంగస్థలం నుంచి వచ్చిన నటులకు ఈయన అండగా నిల్చి ప్రోత్సహిచేవాడు. డబ్బిచ్చి అవసరాలకు ఆదుకునేవాడు. ఇక బామ్మ మాట బంగారు బాటలో భానుమతి సరసన నటించి ఆమెతోనే ప్రశంసలు అందుకున్న నూతన్ ప్రసాద్ ఇక ఆ సినిమాతో అవిటివాడయ్యాడు.
మద్రాసులో చికిత్స పొందుతున్న సమయంలో ఎవరూ రాకపోవడంతో నూటొక్క జిల్లా అందగాడిని, ఇప్పుడు నూటొక్క జిల్లాలకు అవిటివాడిని అంటూ తనమీద తానే సెటైర్ వేసుకుంటూ బాధను దిగమిగుకునేవాడు. ఇక ఈయనకు భార్య ప్రమీలాదేవి, కొడుకు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎవరినీ పరిశ్రమలోకి రానివ్వలేదు.
కొడుకు అంది రాకుండానే అవిటివాడయిన నూతన్ ప్రసాద్ కి ఏళ్లతరబడి భార్య కొడుకు సేవలు చేసారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కొడుకు నూతన్ కుమార్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇక షష్టిపూర్తి చేసికొన్న నూతన్ ప్రసాద్, 2011మార్చి30న శాశ్వతంగా ఈలోకం నుంచి దూరమై ఆ నటరాజమూర్తి పాదాల చెంతకు చేరారు.