Movies

అల్లారు ముద్దుగా పెంచితే అక్కినేని ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు… వీరి కథేమిటో?

బిడ్డలు కనడం,పెంచడం చేయవచ్చు గానీ, వాళ్ళ తలరాతను మార్చడం ఎవరి తరం కాదని అంటారు కదా. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. నటుడు సుమంత్, నటి సుప్రియ ల జీవితం అలానే అయింది . ఎవరికి వారు తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా చివరకు విడాకులిచ్చేసి ఒంటరిగా బతుకుతున్నారు. ఇప్పటికీ వీరి జీవితాన్ని చక్కదిద్దుకునే చర్యలు చేపట్టకుండా తమ జీవితాలను ఓ విధంగా నాశనం చేసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరో అంటే అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తారు. మూడు తరాల నటులతో నటించి,మెప్పించిన మహానటుడు ఆయన. ఇక అక్కినేని కుమారుడు నాగార్జున కూడా చిత్ర పరిశ్రమలో మన్మథుడిగా రాణిస్తున్నారు. అక్కినేనికి నాగార్జునతో పాటు పెద్ద కొడుకు వెంకట్, ఆలాగే కూతుళ్లు సత్యవతి,నాగసుశీల,సరోజ ఉన్నారు.

ఇక అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర. అయితే సత్యవతి మరణంతో ఆమె ఇద్దరు పిల్లలైనా సుమంత్,సుప్రియలను అక్కినేని అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశారు. ఎక్కడా లోటు లేకుండా తీర్చిదిద్దారు. 1975ఫిబ్రవరి 9న పుట్టిన సుమంత్ బాల్యం హైదరాబాద్ లో గడిపినా ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో చేరాడు.
Akkineni nageswara rao and sumanth
అయితే ఆకోర్సుకి స్వస్తి చెప్పి చికాగోలో యాక్టింగ్ స్కూల్ లో డిగ్రీ చేసాడు. 1999లో రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ప్రేమ కథ మూవీతో తెరంగేట్రం చేసాడు. ఆతరువాత యువకుడు,స్నేహమంటే ఇదేరా,పెళ్లి సంబంధం వంటి మూవీస్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు. సినిమాలు చేస్తుండగానే నటి కీర్తి రెడ్డితో ప్రేమలో పడ్డాడు. 2004లో పెళ్లి కూడా చేసుకున్నారు.

కొన్నాళ్ళూ ఆనందంగా గడిపినా ఆతర్వాత ఇద్దరికీ పొసగక పోవడం, సుమంత్ చెల్లి సుప్రియతో కూడా మనస్పర్థలు రావడంతో విబేధాలు తారాస్థాయికి చేరి,సుమంత్, కీర్తిరెడ్డి 2006లో విడాకులు తీసుకున్నారు. సుమంత్ చెల్లి సుప్రియ కూడా సినిమాల్లో నటించింది. 1995లో పవన్ కళ్యాణ్ తొలిసినిమా అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్ గా చేసింది. మళ్ళీ 20ఏళ్ళ విరామం తర్వాత అడవి శేషు గూఢచారి మూవీలో నటించింది.

శ్రేయ హీరోయిన్ గా వచ్చిన ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన చరణ్ రెడ్డిని సుప్రియ ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరి జీవితం కొన్నాళ్ళు సాఫీగా సాగింది. ఇద్దరికీ ఒక కూతురు వుంది. ఆతర్వాత చెడు వ్యసనాలకు బానిసగా మారిన చరణ్ రెడ్డి కి ఎంతచెప్పినా మారకపోవడంతో విడాకులిచ్చేసింది.

అటుపై కూడా అతడు మారలేదు సరికదా వ్యసనాలు పెరిగిపోయి,చివరకు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అక్కినేని వీరిద్దర్నీ గుండెలపై పెట్టుకుని ప్రేమానురాగాలతో పెంచితే,ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని జీవితాలను సరిదిద్దుకోలేక ఒంటరిగా మిగిలారు. మళ్ళీ పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు. మరి అక్కినేని ఆత్మ శాంతించాలంటే వీళ్ళు మారాలి అంటున్నారు అభిమానులు.