తెలుగు ఛానల్స్ – వాటి యజమానులు ఎవరో తెలుసా?
ఒకప్పుడు టీవీ చూడాలంటే ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్ మధ్య పోటీని తట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నాయి. అంతలా ఛానల్స్ వచ్చేసాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల కార్యక్రమాలను అందిస్తున్నాయి. కొన్ని ఛానల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ ఛానెల్స్ ఎవరు ,ఎప్పుడు ప్రారంభించారు.. ఆ ఛానెల్స్ అధినేతలు ఎవరనేది మాత్రం మనకు తెలీదు..వారెవరో తెలుసుకోండి.MAA TV
మా టీవీని మొదట పెన్మెత్మ మురళీ క్రిష్ణంరాజు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఛానల్ ని నిమ్మగడ్డ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ ఛానల్ లో చిరంజీవి,నాగార్జునలకు షేర్స్ ఉన్నాయి. ఈ మధ్య మాటివిని స్టార్ నెట్వర్క్ కొనుగోలు చేసింది. ఇప్పుడు మా టివి బాద్యతలను స్టార్ నెట్వర్క్ సౌత్ రీజియన్ హెడ్ సయ్యద్ కెవిన్ చూసుకుంటున్నారు. GEMINI
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జెమినీ టివి 1995లో ప్రారంభం అయింది. జెమిని గ్రూప్స్ ని కళానిది మారన్ ప్రారంభించారు. కె.విజయ్ కుమార్ CEO గా ఉంటే కె.సుబ్రహ్మణ్యం బిజినెస్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.Zee Telugu:
జి ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లో భాగం అయిన జి తెలుగు ఛానల్ కి బిజినెస్ హెడ్ గా అనురాధ ఉండగా పూనమ్ గోయెంకా CEO గా వ్యవహరిస్తున్నారు.
ETV
ఈనాడు పేపర్ అధినేత రామోజిరావు 1995లో ఈటివిని ప్రారంభించారు. అత్యధికంగా సర్క్యులేట్ అయ్యే పేపర్ గా ఈనాడుకి పేరుంది. ఈ టివి తెలుగులో ప్రారంభమయిన తర్వాత అన్ని లోకల్ భాషల్లోనూ వచ్చింది.
V6
2012 మార్చిలో Vil మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వి6ఛానెల్ ను ప్రారంభించింది. ఈ ఛానెల్ CEO గా అంకం రవి వ్యవహరిస్తున్నారు.TV9
2003లో ప్రారంభమయిన టివి 9 నంబర్ వన్ న్యూస్ ఛానెల్ గా దూసుకుపోతుంది. టివి9 ప్రారంభమయిన నాటి నుండి రవిప్రకాశ్ సిఇఒ గా ఉన్నారు. ఇతర భాషల్లో కూడా టివి9 న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి.
SAKSHI
ఇందిర టెలివిజన్ లిమిటెడ్ ఆద్వర్యంలో 2009 లో ప్రారంభమయిన సాక్షి టివి చైర్మన్ వై.ఎస్ .భారతి.