Movies

బాల రామాయణం యూనిట్ కి చుక్కలు చూపించిన ఎన్టీఆర్ ..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అల్లరి చిన్నపిల్లలు కాకపొతే ఎవరు చేస్తారు చెప్పండి అనడం సర్వసాధారణం. అయితే అల్లరి హద్దుమీరితే ఎలాంటి వారికైనా కోపం వచ్చేస్తుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ చిన్నతనంలో మహా అల్లరి చేసేవాడట. అందరికన్నా తాను ఎక్కువే అన్నట్లుగా అల్లరి ఉండేదట. ఫలితంగా బాల రామాయాణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని అదుపుచేయడం చాలా ఇబ్బంది అయిందట. చిత్ర యూనిట్ ని ముప్పతిప్పలు పెట్టడంతో ఓ దశలో డైరెక్టర్ కూడా కోపంతో తిట్టేశాడట. అవునండి ఎంఎస్ రెడ్డి నిర్మించిన బాల రామాయణంలో అందరూ బాల నటులే. ఇక రాముడుగా జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా నటించి మెప్పించాడు. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఓ సంచలనం.

ఎం ఎస్ రెడ్డి తీసిన బాలరామాయణంలో అందరూ చిన్నపిల్లలే కావడంతో వారందరినీ అదుపుచేయడం మాములు విషయం కాదు. అయితే పెద్ద భారాన్ని చిత్ర బృందం నెత్తికెత్తుకుంది. అందరూ గడుగ్గాయిలే. ఇక ఎన్టీఆర్ అయితే చెప్పక్కర్లేదు. ఎవరూ సరిగ్గా నేర్చుకునే వారు కాదట. జూనియర్ ఎన్టీఆర్ అయితే తెరవెనక విపరీతమైన అల్లరిచేస్తూ పిల్లలను ఏడిపించేవాడట.

బాణాలు విరగొట్టడం,బాణాలు వేసి ఏడిపించడం ఇలా వీరలెవెల్లో అల్లరి దంచేసేవాడట. ముఖ్యంగా శివధనస్సు కోసం టేకుతో ఓ విల్లు తయారు చేయించారట. దాంతో పాటు ఓ డూప్లికేట్ విల్లుని కూడా రూపొందించారట. అయితే షూటింగ్ సమయంలో అంతా సిద్ధం చేసుకుంటుంటే ,జూనియర్ ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కల్సి అల్లరి చేస్తున్నాడట.

అంతటి ఊరుకోకుండా అక్కడ పెట్టిన డూప్లికేట్ శివధనస్సు ను ఎత్తడం మొదలెట్టారట. అది ఈజీగానే ఉండడంతో ఒరిజనల్ టేకు విల్లు ఎలా ఉంటుందోనని, వెతికి వెతికి దాన్ని కూడా ఎత్తేప్రయత్నం చేశారట. అయితే ఎవరి వల్లా కాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించి మొత్తానికి బలవంతంగా ఎత్తేశాడట.

అయితే ఆసమయంలో జూనియర్ కిందపడిపోవడం,విల్లు విరిగిపోవడం జరిగిపోయాయి. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ కి కోపం తన్నుకొచ్చేసి, చెడామడా తిట్టిపోశాడట. దీంతో తాను ఈ సినిమా చేయనని ఇంటికి వెళ్లిపోతానని జూనియర్ ఎన్టీఆర్ ఏడుస్తూ మారాం చేసాడట. మొత్తానికి అందరూ ఊరుకోబెట్టి,బుజ్జగించారు.

ఇక అరణ్య సన్నివేశాలకు యూనిట్ మొత్తం చాలకుడి వెళ్ళింది. అక్కడ విపరీతమైన చలిలో పిల్లలు వణికిపోతుంటే,వాళ్ళను బాణాలతో పొడుస్తూ, కొడుతూ నానా అల్లరి చేసాడట తారక్. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోస్ లో వానర సైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే వానర గెటప్ లో గల పిల్లల తోకలు లాగడం,మూతులు పీకడం వంటివి అల్లరి పనులు చేసేవాడట జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి ఈ సినిమాను పూర్తిచేయడం,మంచి స్పందన రావడం జరిగాయి. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డుని ఈ సినిమా సొంతం చేసుకుంది.