Movies

ఈ అందాల హీరోని టాలీవుడ్ లో తొక్కేసింది ఎవరో తెలుసా?…చివరి రోజులు మరీ దారుణం పాపం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టాలెంటెడ్ హీరోలు సైతం అనుకోని పరిస్థితుల్లో వ్యసనాలకు బానిసవ్వడం వలన తెరమరుగయ్యారు . మరికొందరు టాలెంట్ నిరూపించుకుని కూడా వెనక్కి వెళ్లిపోయారు. ఇలా రకరకాల సంఘటనలు తెలుగు చిత్ర సీమలో కనిపిస్తాయి. ఇక తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ అని మాత్రమే గుర్తొస్తుంది. జనంలో అంతగా వీళ్ళు దూసుకెళ్లారు. ఇందులో ఎన్టీఆర్ లాంటి అందగాడు అప్పట్లో లేరని చెబుతారు. అయితే ఇందుకు హీరో హరనాధ్ విషయంలో మినహాయింపు వుంది. ఎందుకంటే హరనాధ్ రాముడి పాత్రలు వేస్తుంటే, అది చూసి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేవారట. అప్పట్లో రొమాంటిక్ ఐకాన్ గా అప్పటి యూత్ ని విపరీతంగా ఆకర్షించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన నాగు చిత్రంలో చిరంజీవి తండ్రిగా హరనాధ్ నటించారు. అదే ఆయన ఆఖరి చిత్రం.

తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరనాధ్ అసలు పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాధ రాజు. కాలేజ్ డేస్ లోనే నాటకాల్లో వేసే అనుభవం ఉంది. ఆయన తొలిసినిమా మాయింటి మహాలక్ష్మి. నిజానికి హరనాధ్ ని ఎన్టీఆర్ సినిమాల్లోకి పరిచయం చేసాడట. 50-60దశకాల్లో రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

ఉదయాన్ని అమ్మాయిలు ఆయన ఇంటిముందు పడిగాపులు గాసేవారట. డబ్బున్న వాళ్ళ అమ్మాయిలతో పాటు సినీ తారలు కూడా ఇందులో ఉండేవారట. వాళ్ళతో మాటామంతి సాగించడం చేసేవాడు. ఇక షూటింగ్ లేకపోతె కారులో ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడట.
ఇక ఈ దశలోనే మద్యానికి బానిసవ్వడం తద్వారా ఆరోగ్యం చెడగొట్టుకోవడం,దానికితోడు అమ్మాయిల వ్యసనం తోడవ్వడంతో హరనాధ్ మంచి పేరు కోల్పోయాడు. ఎంతో ఉజ్వలమైన కేరీర్ ని దెబ్బతీస్కున్నాడు.

ఇండస్ట్రీలో ఎవ్వరూ పట్టించుకోని స్థితి తెచ్చుకున్నాడు. తాగడానికి డబ్బులు లేకపోతె సెట్స్ మీదికి వచ్చి,నిర్మాతలను డబ్బులు అడిగేవాడట. మీరు ఈ సినిమాలో లేరు కదా డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని నిర్మాతలు అడిగితె,వేషం కోసం కాదు డబ్బు కోసం వచ్చానని హరనాధ్ సిగ్గు విడిచి అడగేసేవాడట. దీంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లేవాడట.

అలా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో తాగేవాడు. మంచి స్టార్ హీరోగా వెలుగొందాల్సిన హరనాధ్ గెస్ట్ రోల్స్ కి పరిమితం అయిపోయాడు. ఓరోజు ఎన్టీఆర్ పిలిచి ‘నేను పరిచయం చేసిన నటుడు ఇలా అయ్యాడంటే అది నాకు అవమానం. మళ్ళీ మునుపటి హరనాధ్ గా కనిపించాలి’అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడట. అయినా సరే హరనాధ్ లో మార్పు రాలేదు. మందు, పొందుకి బానిసవ్వడంతో చివరకు ఓ అనామకుడిలా 1989లో మరణించాడు