Movies

నాని కొత్త ఇల్లు చూస్తే కళ్ళు జిగేల్ మంటాయి… స్టార్ హీరోల సైతం అసూయ పడతారు

తెలుగులో ఇప్పుడు మినిమమ్ గ్యారంటీ గల హీరో ఎవరని అడిగితె నేచురల్ స్టార్ నాని అని చెప్పవచ్చు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాని కష్టపడి పైకి రావడంతో డబ్బు విలువ బాగానే తెలుసు. షూటింగ్ లేకుంటే ఇంటికి వెళ్లి కుటుంబంతో హాయిగా గడుపుతాడు. తాజాగా గచ్చీ బౌలిలో . వెస్ట్రన్ స్టైల్లో ఉండే అధునాతన విల్లా కొన్నాడు. 360డిగ్రీల వ్యూ కనిపించేలా బెడ్ రూమ్ ఏర్పాటుచేసిన ఈ విల్లాలో జిమ్,స్పా,మినీ థియేటర్ అన్నీ వున్నాయి. ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఉన్న ఈ విల్లాను 5 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నాడట.

ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ స్టైల్లో నిర్మితమైన ఈ విల్లాను చూస్తే ఇది ఫారిన్ స్టైల్ హౌస్ అని చెప్పేస్తారు. వెస్ట్రన్ కంట్రీలో బీట్ హౌస్ ఇలా ఉంటుందో నాని విల్లా అలా ఉందని పలువురు మిత్రులు,సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. బెల్జియం గ్లాస్ హౌస్ ఫిట్స్ తో బాల్కనీ,పూర్తిగా ఉడెన్ తో చేసిన పోర్టికో, స్విమ్మింగ్ పూల్,ఖరీదైన కారిడార్ ఆకట్టుకుంటాయి.

దిమ్మతిరిగే ఫ్లోరింగ్ చూస్తే అక్కడ బిగించిన మార్బుల్స్ హిమాలయాలకు వెళ్లిన ఫీలింగ్ కలిగిస్తాయట. ఇక కిచెన్ కూడా అదిరిపోయింది. ఇలా దేనికదే ప్రత్యేకత సంతరించుకున్న నాని ఇల్లు నిజంగా సూపర్బ్. నిజానికి రేడియో జాకీగా చేస్తూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారం ఎత్తిన నాని సడన్ గా హీరో అయిపోయి,వరుస హిట్స్ అందుకుంటున్నాడు.

విభిన్న కదా చిత్రాలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చకున్నాడు.శ్రీను వైట్ల ,బాపు వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టుకుంటూ తిరిగిన నాని అష్టా చెమ్మాతో హీరో స్టేటస్ అందిపుచ్చకున్నాడు. భీమిలి కబడ్డీ జట్టు,అలా మొదలైంది,ఏటో వెళ్ళిపోయింది మనసూ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చకున్న నాని,ఎవడె సుబ్రహ్మణ్యం,భలే భలే మగాడివోయ్ కృష్ణగాడి వీర ప్రేమగాధ, నేను లోకల్,నిన్ను కోరి,మిడిల్ క్లాస్ అబ్బాయి, వంటి చిత్రాలతో నాని రేంజ్ బాగా పెరిగిపోయింది.

అప్పటికే 5కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దాటిన నాని,కృష్ణార్జున యుద్ధం సినిమాకు 10కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక తాజాగా నాగార్జున తో కల్సి నటించిన దేవదాసు మూవీ నిరాశపరిచినా,నాని రేంజ్ తగ్గలేదు.