తమ్ముడు సినిమాలో పవన్ తో జోడి కట్టిన ఈ హీరోయిన్ ఏమి చేస్తుందో తెలుసా?

తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే వెండితెర మీద కాదు బుల్లితెర మీద జడ్జి గా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ‘జెమ్స్ ది ఇండియన్ టాలెంట్’ హంట్ అనే షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో డిఫరెంట్ క్యాటగిరీస్ లో టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహిస్తారట. ఈ షో లో ప్రీతిజింగానియాతో పాటు మరో జడ్జిగా శివ శంకర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఉదయభాను చేస్తుంది. ప్రీతిజింగానియా మాట్లాడుతూ కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ గా అనిపించింది. ఎన్నో డ్యాన్స్ షోలు వచ్చాయి కానీ ఇటువంటి టాలెంట్ షో ఇప్పటి వరకు రాలేదు. జడ్జ్ గా వ్యవహరించమని అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి షోలకు జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. ఈ షో హిట్ అవుతుందని నమ్మకం ఉందని అన్నారు. అంతేకాక మరల తెలుగు ప్రేక్షుకుల అభిమానాన్ని పొందటానికి మరొక మంచి అవకాశమని ప్రీతిజింగానియా అన్నారు.