“వరుణ్ తేజ్” చైల్డ్ ఆర్టిస్ట్ గా “చిరంజీవి” సినిమాలో నటించాడు తెలుసా..?

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగేంద్ర బాబు కొడుకు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా నుంచి మొన్న విడుదల అయినా ఫిదా వరకు భిన్నమైన కధలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఫిదా హిట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తొలిప్రేమ సినిమాతో బిజీగా ఉన్నాడు. 
Varun Tejఅయితే వరుణ్ తేజ్ బాలనటుడిగా ఒక సినిమాలో నటించాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ సినిమాలో ఆలా వచ్చి ఆలా వెళ్ళిపోతాడు. జయసుధ,నాగేంద్ర బాబు,బ్రహ్మనందం ప్రధాన పాత్రలతో వచ్చిన “హాండ్స్ అప్” సినిమా క్లైమాక్స్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో చిరంజీవి అతిధి పాత్రను పోషించాడు. సినిమా చివరలో క్లైమేక్స్ సిన్ లో చిరంజీవి వద్ద ఉన్న మాట్లాడే బొమ్మను అడిగి తీసుకొనే చిన్న అబ్బాయి పాత్రను పోషించాడు.