సాక్షి శివానంద్ టాలీవుడ్ ఎందుకు వదిలేసిందో తెలిస్తే షాకవుతారు… కారణం ఎవరో తెలుసా?
సినిమాల్లో హీరోయిన్స్ గా రాణించాలంటే అన్నీ వదులుకోవాలి అనే నానుడి ఒకటి వినిపిస్తూ ఉంటుంది. దేనికైనా రెడీ అంటేనే ఛాన్స్ లు వస్తాయి. మడిగట్టుకు కూర్చుంటే రావని అందరూ అనేమాట. ఇక కేవలం అందం, అభినయం ఉంటె చాలదండోయ్. సినీ బ్యాక్ గ్రౌండ్ అంతోఇంతో ఉండాలి. లేకుంటే అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హాట్ ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతి పోగొట్టిన సాక్షి శివానంద్ మంచి నటన ఉన్నా సరే, సినీ రంగానికి దూరం అయింది.
సాక్షి పర్సనల్ లైఫ్ లోకి వస్తే,1977ఏప్రియల్ 15న జన్మించింది. తల్లిదండ్రులు కర్ణాటకు చెందినా, ఆమె స్కూల్ డేస్ అన్నీ ముంబయిలోని సాగాయి. 1995లో బాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసిన సాక్షి ,ఆతర్వాత రెండేళ్లకే మెగాస్టార్ చిరంజీవి సరసన మాస్టర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో భారీ ఆఫర్లు వచ్చాయి. అందం, ఎక్స్ పోజింగ్ తో దూసుకుపోయిన ఈమె అక్కినేని నాగార్జున, బాలకృష్ణ,మహేష్ బాబు ఇలా అందరి టాప్ హీరోల సరసన నటించింది. క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పాటుచేసుకున్న ఈ ముద్దుగుమ్మ కి కలెక్షన్ కింగ్ పెద్ద షాక్ ఇచ్చాడు.
నిజానికి హీరోయిన్స్ పట్ల మోహన్ బాబు కొంచెం దురుసుగా ప్రవరిస్తాడని టాక్ ఉంది. మీడియాలో కూడా వార్తలు వస్తుంటాయి. పెదరాయుడు సినిమాలో నటి జయంతిని చెంపదెబ్బ కొట్టాడని అంటారు. ఈమేరకు ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక కలెక్టర్ గారు సినిమా సమయంలో కూడా సాక్షి శివానంద్ ని బెదిరించాడని కూడా వార్తలొచ్చాయి. ఇక మంచు విష్ణు ని హీరోగా పరిచయం చేస్తూ,వచ్చిన విష్ణు మూవీలో సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ హీరోయిన్ గా వేసింది.
ఓ రోజు ఒంట్లో బాగోలేదని ఆమె షూటింగ్ రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్. అయితే ఓ గంట రెస్ట్ తీసుకుని రావాలని మోహన్ బాబు చెప్పడం, అందుకు ఆమె నిరాకరించడం వంటి పరిణామాల్లో ఆమె పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వచ్చాయి. దీంతో సాక్షి పోలీసులకు పిర్యాదు చేసినా ఫిలితం లేకపోయింది. రాజకీయంగా పలుకుబడి గల మోహన్ బాబుని ఏమీ చేయలేమని తెల్సి, కేసు వాపసు తీసుకుని ,కుటుంబంతో సహా ముంబయికి వెళ్ళిపోయింది. ఆవిధంగా ఓ టాలెంటెడ్ హీరోయిన్ ఇండస్ట్రీ వదిలిపోవాల్సి వచ్చింది.