Movies

ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన విలన్ రామిరెడ్డి చివరి రోజుల్లో ఆలా అవటానికి కారణం తెలుసా?

తెలుగు సినిమాల్లో విలనిజంకు కొత్త అర్ధాన్ని తీసుకువచ్చాడు రామి రెడ్డి. 90 దశకం సినిమాల్లో రామి రెడ్డి కేరాఫ్ అడ్రెస్ గా మారారంటే అతిశయోక్తి కాదు. చిత్తూర్ జిల్లా వాయిల్పాడు లో జన్మించిన రామి రెడ్డి అసలు పేరు గంగిస్వామి రామిరెడ్డి. రామి రెడ్డి మొదటగా జర్నలిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా దర్శకుడిగా తన అదృష్టాన్ని .పరీక్షించుకొని  అవేమి సక్సెస్ కాకపోవటంతో విలన్ పాత్రల వైపు టర్న్ అయ్యారు. 
రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాతో టాలీవుడ్లో విలన్ గా శ్రీకారం చుట్టారు. మొదటి సినిమానే హిట్ కావటంతో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాలేదు.ఒసేయై రాములమ్మ,అమ్మోరు,పెద్దరికం,అనగనగా ఒక రోజు వంటి. అనేక మంచి సినిమాలను చేసారు. తెలుగు,తమిళ,కన్నడ,హిందీ,బోజ్పురి భాషల్లో దాదాపుగా 260 సినిమాల్లో నటించారు. రామి రెడ్డి ఎక్కువగా కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే నటించారు. ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది. అయన కెరీర్ పిక్ దశలో ఉన్నప్పుడే మూత్రపిండాల వ్యాథితో అనారోగ్యానికి గురి అయ్యారు. ఆ సమయంలో రామి రెడ్డి బాగా చిక్కిపోయి అసలు గుర్తుపట్టడానికి వీలులేకుండా మారిపోయారు.ఆ సమయంలోనే కొన్ని టీవీ షోస్ చేసారు. ఆ షో లలో రామి రెడ్డిని చుసిన అభిమానులు చాలా బాధ పడ్డారు. ఆ తర్వాత కొంచెం కోలుకున్నట్టు కన్పించిన మరల ఆ వ్యాధి తిరగపెట్టటంతో రామి రెడ్డి ఆ వ్యాధితో పోరాటం చేస్తూ కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్ 14 న తుది శ్వాస విడిచారు.