బాలల దినోత్సవం వెనక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసా?
పంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954 కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితినిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.
1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.