Movies

జయమాలిని గుర్తు ఉందా… ఆమె ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందో తెలిస్తే అయ్యో పాపం అంటారు

సినిమా పరిశ్రమ నిజంగా చిత్ర విచిత్రమే. ఒకప్పుడు దర్జాగా బతికినవాళ్లు ఇప్పుడు దయనీయస్థితికి చేరడం,ఒకప్పడు తినడానికి తిండిలేని వాళ్ళు కోట్లకు పడగలెత్తడం చూస్తూంటాం. ఇక ఒకప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే ఒక వాంప్ సాంగ్ ఉండితీరాల్సిందే. అది ఎన్టీఆర్ కావచ్చు,ఏ ఎన్ ఆర్ కావచ్చు ,కృష్ణ ,శోభన్ బాబు,కృష్ణంరాజు ఇలా హీరో ఎవరైనా అందులో క్లబ్ డాన్స్ తప్పనిసరిగా ఉండేది. ఇలాంటి డాన్సులకు జయమాలిని పెట్టింది పేరు. ఆతర్వాత అనురాధ. సిల్క్ స్మిత వంటి వాళ్ళు వచ్చినా జనమాలిని క్రేజ్ వేరు. తెలుగులోనే కాకుండా , తమిళ,హిందీ ప్రత్యేక సాంగ్స్ లో నటించి మెప్పించింది.

ఇక జయమాలిని అక్క జ్యోతిలక్ష్మి కూడా ఇలాంటి డాన్సులు వేసేది. కొన్ని పాటల్లో అక్కాచెల్లెళ్ళిద్దరూ కల్సి నటించారు. కొంతకాలం వీరి హవా నడిచినా, కాలంలో వచ్చిన మార్పు,వీళ్లకు వయస్సు మీదపడడంతో తెరమరుగయ్యారు. కొంతకాలం క్రితం జ్యోతిలక్ష్మి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కొద్దికాలం క్రితం ఆమె ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించడంతో జయమాలిని ఒంటరిదైంది.

అక్కాచెల్లెళ్ళిద్దరూ ఎక్కడకు వెళ్లినా కల్సి వెళ్లేవారట. హఠాత్తుగా అక్క మరణంతో జయమాలిని మనోవేదనకు గురైంది. డిప్రెషన్ లోకి వెళ్ళింది. అయితే జ్యోతిలక్ష్మి బతికున్నప్పుడు అక్కాచెల్లెళ్లు కల్సి విపరీతంగా డబ్బు ఖర్చు చేసారు. అక్క మరణంతో డబ్బు సమస్యలు ఎక్కవయ్యాయి. పైగా అప్పులవాళ్ళు వచ్చి మీద పడడంతో చేసేది లేక ఆస్తి అంతా అమ్మేసి అప్పులు తీర్చడంతో చేతిలో చిల్లిగవ్వ లేక రోడ్డున పడింది.

పూటగడవాడేం కష్టంగా మారిందట. ఇంతకు ముందు వీళ్ళ సాయం పొందిన బంధువులు కూడా ముఖం చాటేశారు. ఇలాంటి సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చి ఆదుకోవాలని పలువురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనస్థితిలో గల జయమాలినిని ఆడుకోవాలన్న విజ్ఞప్తులు కోకొల్లలుగా వస్తున్నాయి.