Movies

ఈ నటిని గుర్తు పట్టారా….ఈ నటి ‘మనమడు’ ‘స్టార్ హీరో’ అని మీకు తెలుసా

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయంతి 1950 వ సంవత్సరంలో బళ్లారిలో జన్మించింది. జయంతి అసలు పేరు కమలా కుమారి. జయంతి తండ్రి బాల సుబ్రహ్మణ్యం బెంగుళూర్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ఆమె తల్లి పేరు శాంత లక్ష్మి. జయంతికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. జయంతి చిన్నతనంలోనే తల్లితండ్రులు విడిపోవటంతో జయంతి తల్లి పిల్లలను తీసుకోని చెన్నయ్ చేరింది. అందువల్ల జయంతి చిన్నతనంలో కష్టాలు అనుభవించింది. చెన్నయ్ వచ్చాక జయంతి తల్లికి జయంతికి క్లాజికల్ డాన్స్ నేర్పించాలని కోరిక ఉండటంతో జయంతిని ఒక డాన్స్ స్కూల్ లో జాయిన్ చేసింది.అక్కడే నటి మనోరమ పరిచయం కలిగింది. జయంతి చిన్నతనంలో కాస్త బొద్దుగా ఉండటం వలన డాన్స్ చేయటానికి చాలా కష్టపడేది. జయంతి ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ ని చూడాలనే కోరికతో చెన్నైలో స్టూడియోలకు వెళుతూ ఉండేది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ షూటింగ్ గ్యాప్ లో జయంతిని పిలిచి మాట్లాడి పెద్దయ్యాక నాతో హీరోయిన్ గా చేస్తావా అని అడిగారు. జయంతి ఆయనతో కలిసి నటిస్తానని…అలాగే ఆయనతో సినిమా తీసి హిట్ కొడతానని అప్పుడు అనుకోని ఉండదు.ఆమె జీవితంలో కీలక మలుపు కన్నడ డైరెక్టర్ స్వామి రూపంలో వచ్చింది. జయంతి డాన్స్ ని చూసిన స్వామి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆలా మొదట జయంతి కన్నడలో హీరోయిన్ అయింది. 
ఆమె నటించిన ‘మిస్ లీలావతి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో కన్నడలో స్టార్ హీరోయిన్ హోదా రావటమే కాకుండా మకుటం లేని మహారాణి అయింది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తో దాదాపుగా 45 సినిమాల్లో నటించింది. తెలుగు సినీ రంగానికి 1965 లో ‘భార్యాభర్తలు’ సినిమాతో వచ్చింది. ఆ తర్వాత తన అభిమాన నటుడి సరసన నటించటమే కాకుండా ఎన్టీఆర్ తో జగదేగవీరుని కథ,కుల గౌరవం,జస్టిస్ చౌదరి వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించింది. జయంతి దాదాపుగా 500 సినిమాలకు పైగా నటించింది. జయంతి భర్త ఒకప్పటి నటుడు,స్టార్ డైరెక్టర్ అయినా పేకేటి శివరాం. పేకేటి శివరాం కి జయంతి రెండో భార్య. పేకేటి శివరాం మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు,నలుగురు కూతుళ్లు. శివరాం రెండో కూతురు శాంతి కొడుకు హీరో ప్రశాంత్. అంటే జయంతికి ప్రశాంత్ మనమడు అవుతాడు.ప్రశాంత్ చాలా చిన్న వయస్సులోనే స్టార్ డమ్ సంపాదించాడు. ప్రశాంత్ తండ్రి త్యాగరాజ్ కూడా నటుడు మరియు డైరెక్టర్. ప్రశాంత్ 90 లో టాప్ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో జోడి కట్టాడు. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ప్రశాంత్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండేది. మన అందరకు బాగా పరిచయం ఉన్న జయంతికి ప్రశాంత్ మనమడు అవుతాడు అనే విషయం చాలా కొద్దీ మందికి మాత్రమే తెలిసిన విషయం.