Movies

పవర్ స్టార్ మొద‌టి భార్య గురించి మీకు తెలియ‌ని నిజాలు

పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి విశాఖపట్నంనకు చెందిన నందినితో 1997 మే 17న జరిగింది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే పవన్,నందిని మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావటంతో పెళ్లి అయిన సంవత్సరానికి పుట్టింటికి వెళ్ళిపోయింది. పవన్ తీరు ఏ మాత్రం మారకపోవడంతో విడాకుల నోటీసు 2007 లో పంపింది. అయితే పవన్ తో బేధాభిప్రాయాలు ఉన్నా సరే హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నందిని పవన్ కళ్యాణ్ ని కలిసి వెళ్లెదట. 
ఆ సమయంలోనే పవన్ తన సహా నటి రేణు దేశాయ్ తో సహజీవనం చేస్తున్నాడని తెలిసి 2005 నుంచి మాట్లాడటం, కలవటం మానేసింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో నందిని తనకు మెయింటెనెన్స్ కోసం నెల‌కు రూ.5 ల‌క్ష‌లు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరికి 2008 లో కోర్టు మంజూరు చేసింది. పవన్ తో విడాకులు తీసుకున్నాక నందిని తన పేరును జాహ్న‌విగా మార్చుకుంది. 2010 లో జాహ్న‌వి(నందిని) మరో వివాహం చేసుకుందని సమాచారం.