మీ రాశిని బట్టి మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందో తెలుసుకొని మీ బాధలను,కష్టాలను తొలగించుకోండి

హిందువులు అనేక మంది దేవతలను,దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఏ వారం ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదో తెలుస్కొని మరీ పూజలు చేస్తూ ఉంటాం. అయితే మీ రాశిని బట్టి కూడా దేవుణ్ణి పూజించవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు మీ రాశి ప్రకారం ఏ దేవుణ్ణి పూజిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ శాంతులు కలుగుతాయో తెలుసుకోండి.

కన్యా రాశి, మిధున రాశిలో పుట్టినవారు విష్ణు మూర్తిని పూజించి కోరికలు కోరుకుంటే నెరవేరతాయి. అంతేకాక విష్ణు మూర్తి అవతారం అయినా ఆ ఏడుకొండలవాణ్ణి అయినా పూజించవచ్చు.

మేష రాశి,కుంభ రాశి,కర్కాటక రాశి, మకర రాశి వారు శివుణ్ణి పూజిస్తే అనుకున్న పనులు నెరవేరటమే కాకుండా చేసే పనులలో సానుకూలత ఉంటుంది.

సింహ రాశి వారు శివునికి అభిషేకం చేసి కోరికలను కోరుకుంటే ఆ కోరికలు త్వరగా నెరవేరతాయి.

వృచ్చిక రాశి వారు గౌరీ దేవి లేదా పార్వతి దేవిని ప్రసన్నం చేసుకోవాలి. పార్వతీదేవిని పూజిస్తే కష్టాలు అన్ని తొలగిపోతాయి.

తుల రాశి,వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు తిరటమే కాకా అనుకున్న పనులు అన్ని త్వరగా నెరవేరతాయి.

ధనస్సు,మీనా రాశి వారు శ్రీ దక్షిణ మూర్తిని పూజిస్తే కష్టాలు అన్ని తొలగిపోతాయి.

రాశులను బట్టి కాకుండా.. ప్రతి ఒక్కరూ.. ఉదయాన్నే స్నానం చేశాక సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ఎందుకంటే.. అన్ని నక్షత్రాలను పాలించే సూర్యుడి అనుగ్రహం పొందడం వల్ల సుఖసంతోషాలతో ఉండగలరు.