Movies

వైవిఎస్ చౌదరి ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఆమె టాప్ హీరోయిన్…ఎవరో చూడండి

యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి అంటే సినిమా ఫీల్డ్ లోనే కాదు, సినీ జనాలకు కూడా తెలియదు. అయితే షార్ట్ కట్ లో వైవీఎస్ చౌదరి అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తాడు. ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగు ఇండస్ట్రీలోకి వైవిఎస్ చౌదరి అడుగుపెట్టి,దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు,రామ్ గోపాల్ వర్మ,కృష్ణవంశీ ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో దర్శకుని అవతారం ఎత్తిన వైవిఎస్ ఆ సినిమా సంచలన విజయం నమోదుచేసుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నాగార్జున, హరికృష్ణ కాంబినేషన్ లో సీతారామరాజు మహేష్ బాబుతో యువరాజు చిత్రాలతో వైవిఎస్ మారుమోగింది.

ఇక గోవా బ్యూటీ ఇలియానా ను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేస్తూ, వైవిఎస్ తీసిన దేవదాస్ చిత్రం ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. రామ్ , ఇలియానా జంటగా వచ్చిన ఈ మూవీ కొత్త దేవదాస్ ని చూపించింది. ఇక హరికృష్ణకు హీరోయిజం తీసుకొచ్చి,స్టెప్పులేయించిన ఘనత కూడా వైవిఎస్ దే . దేవదాస్ మూవీతో స్టార్ డైక్రెక్టర్ హోదా తెచ్చేసుకున్న వైవిఎస్ టాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేసాడు.

సీతయ్య, ఒక్కమగాడు,లాహిరిలాహిరిలో,సీతారామరాజు చిత్రాల్లో హరికృష్ణను ఓ రేంజ్ లో చూపించి నందమూరి అభిమానులకు దగ్గరయ్యాడు. ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి,ఎన్నో చిత్రాలు తీసాడు. కాగా కృష్ణ వంశి డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమా లో హీరో నాగార్జున చెల్లెలి పాత్రలో నటించిన గీతను చూసి మనసు పారేసుకున్న వైవీఎస్ చాలారోజు ఐ లవ్ యు చెప్పాలా వద్దా అనే డైలామాలో ఉంటూ ఎట్టకేలకు మనసులో మాట చెప్పడంతో గీత కూడా ఒకే చెప్పేసింది.

నిజానికి ఆలీ వంటి వాళ్ళతో గీత హీరోయిన్ గా చేసింది. ఈమెది హైదరాబాద్. ఒక్కర్తే అమ్మాయి కావడంతో ఎంతో గారాబంగా పెంచారు. తల్లితరపు వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో గీతను కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలని తల్లి అనుకుంది. కాలేజీ డేస్ లో కొన్ని మ్యాగజైన్స్ కి మోడలింగ్ చేయడం, ఆతర్వాత టివి సీరియల్స్ లో నటించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దల దృష్టిని ఆకర్షించింది.

వైవిఎస్ ,గీత ఇద్దరూ ఇష్టపడడంతో ఇంట్లో వాళ్ళు కూడా అడ్డుచెప్పలేదు. దీంతో వీరి బంధం పెళ్లిపీటలెక్కింది. పెళ్లి టైం కి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువొతోంది. ఇక పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లయ్యాక కాలేజీకి వైవిఎస్ డ్రాప్ చేసేవాడట. ప్రస్తుతం ఇంటికి పరిమితమై,కుటుంబంతో గడుపుతూన్న వైవిఎస్ త్వరలోనే గీత సహకారంతో టీవీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.