ఈ నటుడు తమ్ముడు తెలుగులో మనకు బాగా తెలిసిన స్టార్ హీరో ఎవరో తెలుసా….అయితే చూడండి

సినీ పరిశ్రమలో చాలా చిత్ర విచిత్రాలుంటాయి. కొందరు స్టార్స్ గా ఇదిగాక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈస్థాయికి వచ్చామని చెబుతారు. మరికొందరు బ్యాక్ గ్రౌండ్ దండిగా ఉండడంతో స్టార్స్ గా ఎదిగిపోతారు. ఇప్పుడు ఇలాంటి వల్లే ఇండస్ట్రీలో చాలామంది వున్నారు. ఇక కొందరికి బ్యాక్ గ్రౌండ్,ఫుల్ సపోర్ట్ ఉన్నా సరే, ఎదగలేరు. ఆటోమేటిక్ గా వాళ్ళు పక్కకి పోతారు. ఇక బ్యాక్ గ్రౌండ్ ఉండికూడా దాన్ని అసలు వినియోగించుకోకుండా వచ్చిన ఛాన్స్ లను బట్టి నటిస్తూ తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంటారు. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే హీరో ఒకడున్నాడు అతనికి బ్యాక్ గ్రౌండ్ చాలానే ఉంది. ఔనా అని ఆశ్చర్యపోతాం. అతనెవరో కాదు దగ్గుబాటి రాజా. సినిమాల్లోంచి స్వచ్ఛందంగా తప్పుకుని బిజినెస్ లో స్థిరపడ్డాడు. ఇండియాలోనే నెంబర్ వన్ గ్రానైట్ కంపెనీగా తీర్చిదిద్దాడు.

రాజా అసలు పేరు వెంకటేష్, అయితే తమిళంలో 1981లో పాక్ వె దిల్ అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అప్పుడు డైరెక్టర్ భారతీరాజా అతని పేరుని రాజాగా మార్చాడు. ఆతర్వాత వైదేహి అనే మూవీతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఈయన బాబాయి దగ్గుబాటి చేర్చి దగ్గుబాటి రాజాగా పరిచయం చేసాడు. బాబాయ్ అంటే ఎవరో కాదు మూవీ మొఘల్ రామనాయుడే.

ఇక రాజాకు వెంకటేష్ అన్నయ్య అవుతాడు. తెలుగు వాడైనప్పటికీ తెలుగు కన్నా తమిళంలోనే మంచి ఛాన్స్ లు వచ్చాయి.పైగా సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే రానురాను తమిళంలో ఛాన్స్ లు తగ్గడంతో తెలుగులో సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. తెలుగులో చిన్నారి స్నేహం,సంకెళ్లు,సిరిపురం చిన్నోడు,శ్రీకృష్ణార్జున విజయం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.

నిజానికి సినిమా లో యాక్టింగ్ అంటే అంతగా ఇష్టం లేని రాజా ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చి, సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. ప్రొడ్యూసర్స్,డైరెక్టర్స్ కూడా కేవలం సపోర్టింగ్ కేరక్టర్స్ కోసం తనను వెతుక్కుంటూ వచ్చేవారని, అందుకే తన నటనకు ప్రాధాన్యత గల పాత్రలు పెద్దగా రాలేదని ఈ మధ్య ఓ ఇంటర్యూలో దగ్గుబాటి రాజా చెప్పుకొచ్చాడు.

బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఎవరినీ ఫలానా పాత్రకు తనను ఎంపిక చేయాలని ఎప్పుడూ అడగలేదని, ఇక ఇలా సపోర్టింగ్ కేరక్టర్స్ చేయడం కన్నా దూరంగా ఉండడం మంచిదన్న ఉద్దేశ్యంతో పక్కకు తప్పుకున్నానని చెప్పాడు. తండ్రి , సోదరులు చేస్తున్న గ్రానైట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన రాజా సొంతంగా కాస్మో గ్రానైట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ పెట్టాడు. ఇది ఇండియాలో అత్యుత్తమ కంపెనీగా పేరుగాంచింది. మొత్తం మీద బ్యాక్ గ్రౌండ్ ఉండికూడా ఉపయోగించుకోకుండా స్వశక్తితో ఎదిగాడు దగ్గుబాటి రాజా.