సూర్యకు మొదటి పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే నోరెళ్లబెడతారు… అది తండ్రికి తెలియకుండా….?
జీవితం ఎటు మలుపు తిప్పుతుందో ఎవరూ చెప్పలేరు. ఘటన ఉంటె జరిగి తీరుందని అందుకే అంటారు. సరిగ్గా హీరో సూర్య విషయంలో అదే జరిగింది. సినిమాలంటే అసలు ఇష్టం లేని యితడు స్టార్ హీరో అయిపోయాడు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే యితడు హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు అతడు కోరుకున్నవి కాదు. అనుకోకుండా జరిగినవి. సూర్యకు తమ్ముడు కార్తీక్,ఓ సోదరి ఉన్నారు. సూర్య తండ్రి శివకుమార్ సినిమా హీరోనే. చూడ్డానికి శోభన్ బాబులా ఉంటారు. ఇండస్ట్రీలో మంచి పేరుంది. పాత్ర పోషించాక డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమీ అడిగేవాడు కాదు. దీన్ని బట్టి అతడి మనస్తత్వం ఏమిటో చెప్పొచ్చు.
ఇక సూర్యను సినిమాల్లో చేర్చాలని తండ్రి శివకుమార్ కోరికగా ఉండేది. అయితే బిజినెస్ అంటే ఇష్టపడే సూర్య 750రుపాయలకు ఓ కంపెనీలో ఉద్యోగంలోకి చేరాడు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్ అనే కంపెనీ సొంతంగా పెట్టి ,రోజుకి బైక్ పై 100కిలోమీటర్లకు పైగా వెళ్ళేవాడు. రోజుకి 18గంటలు పని ఉండేది. ఎంతకష్టపడ్డా వారి ఆర్ధిక స్థితి అంతంతమాత్రంగానే ఉండేది.
ఇంట్లో చెల్లి పెళ్లి చేయాలి. అందుకే సూర్యకు సినీ ఛాన్స్ లకోసం తండ్రి శివకుమార్ ప్రయత్నం చేస్తూ,ఫోటోలు మణిరత్నం కి పంపాడు. ఆ ఫోటోలు నచ్చడంతో తమిళంలో నేరుక్కునేరు సినిమా ద్వారా తెరకు పరిచయం చేసాడు. అయితే నటనంటే భయంతో వణికిపోతుంటే పక్కనే ఉన్న డైరెక్టర్ విజయ భాస్కర్ ఏం భయపడకని ధైర్యం చెబుతూ అన్నీ ఆడియన్స్ నేర్పిస్తారని, అయితే కొంచెం ఓర్పుగా ఉండాలని సూచించాడు.
ఆవిధంగా ధైర్యం తెచ్చకున్న సూర్య ఒక్కో సినిమాలో ఒక్కో టెక్నీక్ నేర్చుకుంటూ వచ్చాడు. తొలిసినిమాకు కేవలం 50వేలరూపాయలు మాత్రమే తీసుకున్న సూర్య ముందుకు సాగుతుంటే తండ్రి సీరియల్ లో నటిస్తూ, వచ్చిన డబ్బుతో చెల్లి పెళ్లి చేసేసారు. నిజానికి హీరోయిన్ చేయి పట్టుకోవాలంటేనే భయం. ఆడవారికి ఆమడ దూరంలో ఉండేవాడు. అలాంటిది జ్యోతికతో తొలిసినిమా చేసాక అది హిట్ అవ్వడం దీంతో వరుసగా వీరి కాంబినేషన్ లో సినిమాలు రావడం జరిగాయి.
రొమాన్స్ సీన్స్ చేసినా సరే,ఆతర్వాత పక్కకు వెళ్లిపోయేవాడు. అయితే వారి మధ్య రూమర్స్ పెరిగాయి. ఆవిధంగా వారిద్దరి మధ్య ఏర్పడ్డ మాటలు,పరిచయం,ప్రేమగా మారింది. వారి ఆచారాలు మన ఆచారాలు సరిపడవని పెళ్ళికి తండ్రి శివకుమార్ ఒప్పుకోలేదు. అయితే జ్యోతికకు ఇచ్చిన మాటకోసం రహస్యంగా సూర్య పెళ్లి చేసేసుకున్నాడు. దీంతో తండ్రి శివకుమార్ చేసేదిలేక అందరి ముందు ఘనంగా పెళ్లి జరిపించాడు.