Movies

“చక్రవాకం” సీరియల్ లో నటించిన ఈ 8 మంది ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

తెలుగు సీరియల్స్ చరిత్రలో ‘చక్రవాకం’ చరిత్ర సృస్టించిందని చెప్పవచ్చు. ఈ సీరియల్ ని మంజులా నాయుడు,బిందునాయుడు డైరెక్ట్ చేసారు. వారు రాసుకున్న కధనం,తీసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సీరియల్ లో నటించిన నటులు కూడా ఈ సీరియల్ ఇంత స్థాయిలో హిట్ అవటానికి కారణం అని చెప్పవచ్చు. ఈ సీరియల్ లో నటించిన నటులు అందరు ఇంచుమించు టాప్ రేంజ్ కి వెళ్లి హ్యాపీ గా ఉన్నారు. ఇప్పుడు వారు ఏమి చేస్తున్నారో తెలుసుకుందాం. వారిలో మొదటగా ఇంద్రనీల్ గురించి చెప్పుకోవాలి. 
ఇంద్రనీల్ 
చక్రవాకం సీరియల్ లో నటించిన ఇంద్రనీల్ అసలు పేరు రాజేష్. చక్రవాకం సీరియల్ లో పేరు ఇంద్ర తో సెటిల్ అయిపోయాడు. అసలు పేరు రాజేష్ అని చాలా మందికి తెలియదు. ఈ సీరియల్ లో ఇంద్రకి అత్తగా చేసిన మేఘనరామిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ జోడి ‘స్టార్ మా’లో వస్తున్న నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. 
ప్రీతి అమీన్
చక్రవాకం సీరియల్ లో ప్రీతి అమీన్ స్రవంతి పాత్రను పోషించింది. కొన్ని హిందీ సీరియల్స్ లో నటించింది. చక్రవాకం సీరియల్ అయ్యిపోయాక పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. 
సెల్వరాజ్ 
ఈ సీరియల్ లో ఇంద్ర,స్రవంతిల ప్రేమ లానే,ఇక్బాల్ ,స్రవంతి ల స్నేహం కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఇక్బాల్ గా పరిచయం అయిన సెల్వ ఆ తర్వాత మొగలిరేకులు లో సెల్వ గా చాల అముఞ్చి పేరు సంపాదించాడు. ఒక పక్క సీరియల్స్ మరో పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 
శృతి 
సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికి శృతి తెలుస్తుంది. ఎందుకంటే ఆమె రుతురాగాలు, మొగలిరేకులు, ,చక్రవాకం సీరియల్ లలో కూడా నటించింది. ఆమె తల్లి నాగమణి కూడా నటిగా ఎన్నో సీరియల్స్ చేసింది. శృతి భర్త మధుసూదన్ కూడా నటుడే. 

మేధ 
మేధ చక్రవాకం సీరియల్ తోనే ఈ రంగానికి వచ్చింది. ఆ తర్వాత మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురుగా నటించింది. ఆ తర్వాత మొఘలిరేకులు లో కీర్తన గా నటించి అముఞ్చి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని సీరియల్స్ కి దూరం అయింది మేధ. 
సాగర్

చక్రవాకంలో సాగర్ గా, మొగలిరేకకులులో ఆర్కె గా,మున్నాగా చాలా క్రేజ్ సంపాదించుకొని సినిమాలో హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. 
పావని 
పావని చక్రవాకం సీరియల్ లో నటించటానికి ముందే చాలా సీరియల్స్ లో నటించింది. అయితే చక్రవాకం సీరియల్ లో నటించాక అవకాశాలు బాగా పెరిగాయి. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని సినిమాలు,సీరియల్స్ కి దూరంగా ఉంది. 
లహరి 
చక్రవాకం సీరియల్ తర్వాత లహరి చాలా బిజీగా మారిపోయింది. మొగలిరేకులు,ఆరాదన,ముద్దుబిడ్డ,లయ వంటి సీరియల్స్ లో నటించటమే కాకుండా చాలా సినిమాల్లో నటించింది.