Movies

అందరి ముందు బాలు నైజాన్ని బయట పెట్టిన ఎస్. జానకి… షాకైన బాలు

సినిమాలో పాటలంటే ఇప్పుడు చాలామంది పడేస్తున్నారు గానీ ఒకప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇక అప్పుడు ఉన్న గాయకుల మధ్య అనుబంధం కూడా బాగుండేది. సత్సంబంధాలు ఉండేవి. పాడుతా తీయగా పుణ్యమాని మెరికల్లాంటి సింగర్స్ ఇప్పుడు వచ్చేసారు. అయితే గతంలో అయితే ఘంటసాల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,కేజే ఏసుదాస్,పి సుశీల, ఎస్ జానకి, చిత్ర ఇలా వేళ్ళమీద లెక్కపెట్టే గాయకులుండేవారు. ముఖ్యంగా 70దశకం నుంచి 90వ దశకం వరకూ స్వర్ణ యుగంగా సినీ నేపధ్యగానం సాగిందని చెప్పాలి. ఎందుకంటే మ్యూజికల్ క్లాసిక్స్ అలాటివి మరి.

సంగీతమే ప్రధాన ఇతివృత్తంగా శంకరాభరణం, శృతిలయలు,స్వాతికిరణం,మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయని వేరే చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆ పాటలు పాడుతూ వాటికి జీవం పోసిన ఘనత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,ఎస్ జానకి వంటి గాయకులకు దక్కుతుంది. బాలు,జానకి మధ్య మంచి క్లోజ్ నెస్ ఉండేది. ఎందుకంటే ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్. జానకి పలు విషయాలను పంచుకుంటూ ఎస్పీ బాలు ప్రవర్తన రికార్డింగ్ థియేటర్ లో ఎలా ఉండేదో చెప్పడంతో అందరూ షాకయ్యారు.

ఆసక్తిగా విన్నారు. ఏదైనా పాటకు ట్రాక్ లు తీయాల్సి వచ్చినపుడు తానె ముందు పాడేసి వెళ్లిపోయేవాడని,దీంతో తాను వెయిట్ చేయాల్సి వచ్చేదని చెప్పారు.ఎక్కడ తాను లేట్ చేస్తానోనని తానె ముందు పాడేసి వెళ్లిపోవడం, ఒకవేళ ఇద్దరం కల్సి పడాల్సి వస్తే,కోతిచేష్టలతో బాలు విసిగించేవాడు. ఇక రిహార్సల్స్ లో నేను ఏదైనా ఇంప్రూవ్ చేసి పాడితే,దాన్ని అతడే ముందు పాడేసేవాడు.

దాంతో అందరూ అబ్బా బాలు ఎంత బాగా పాడాడు, జానకి కూడా బాలు లాగే పాడింది అని అందరూ అనుకునేవారు. ఆ ఇంప్రూవ్ మెంట్ చేసింది తానేనని ఎవరు గుర్తించేవారు కాదని వాపోయింది. ఇక నేను సింగిల్ గా పాడుతుంటే ఎదురుగా నిల్చొని కోతిలా వెక్కిరించేవాడు. ఒకవేళ తప్పుగా మాట్లాడితే అందరి ముందు మైక్ తీసుకుని’ఏంటండీ జానకి గారు ఇన్నేళ్ల నుంచి పాడుతున్నారు.

సంగీతం నేర్చుకుని కూడా ఇలా తప్పులు పడేస్తే ఎలా?’అని చెప్పేసేవాడు. దాంతో అందరూ నిజం అనుకుని నమ్మేసేవారు. నాతొ పాటు రికార్డింగ్ థియేటర్ కి వచ్చిన మా ఆయన కూడా అది నిజమనే స్థితికి వచ్చేవారు. ఇలా ఎన్నో సంగతులు ఆమె పంచుకుంది.