వెంకటేష్ రిజెక్ట్ చేసిన 6 సూపర్ హిట్ సినిమాలు

విక్టరీ వెంకటేష్ నిర్మాత రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన తన సొంత ఇమేజ్ తో ముందుకు సాగుతున్నాడు. తన తరం హీరోల కన్నా ముందుగా నిర్ణయం తీసుకోని మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తూ తన వయస్సుకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే వెంకటేష్ కెరీర్ లో కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ మిస్ చేసుకున్న సినిమాల వివరాలను తెలుసుకుందాం. 

ఘర్షణ
మణిరత్నం ‘ఘర్షణ’ సినిమా తీసినప్పుడు మొదటగా వెంకటేష్,నాగార్జునను అడిగారట. వారు రిజెక్ట్ చేస్తే ప్రభు,కార్తీక్ తో తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.రోజా
మణిరత్నం ‘రోజా’ సినిమా ద్వారా వెంకటేష్ కి మరోసారి అఫర్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను కూడా వెంకటేష్ రిజెక్ట్ చేసాడు. ఈ సినిమా అరవింద్ స్వామి చేసి హిట్ కొట్టాడు. 
ఒకే ఒక్కడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమా అఫర్ మొదట వెంకటేష్ దగ్గరకే వచ్చింది. వెంకటేష్ కాదని చెప్పటంతో ఆ అఫర్ అర్జున్ ని వరించింది. వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
సంతోషం
కుటుంబ కథ చిత్రాలు చేసే వెంకటేష్ కి మొదట దశరధ్ ‘సంతోషం’ కథను చెప్పాడట. అయితే వెంకటేష్ కాదని అనటంతో నాగార్జున చేసి సూపర్ హిట్ కొట్టాడు. 
కృష్ణం వందే జగద్గురుం
దర్శకుడు క్రిష్ మొదట వెంకటేష్ ని దృష్టిలో పెట్టుకొని ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా కథను రాసుకున్నాడట. అయితే చివరి నిమిషంలో రాణా చేతిలోకి వెళ్ళింది. 
గోవిందుడు అందరివాడేలే

కృష్ణ వంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కోసం వెంకటేష్ కి కథ చెప్పాడట. అయితే వెంకటేష్ కాదని అనటంతో శ్రీకాంత్ చేసాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ కి మంచి పేరు వచ్చింది.