ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా?

ఈ అందాల భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి ‘ఏ మాయ చేసావే’ అంటూ టాలివుడ్ కి వచ్చిన సమంతా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ చెన్నై భామ టాలీవుడ్ కి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించింది. 
సమంతా మదురై లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. ఆమె ముద్దు పేరు సామ్. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. 

నటించిన మొదటి సినిమాలోనే లిప్ లాక్ కి ఒకే చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగ చైతన్య తో అనేక ముద్దు సన్నివేశాల్లో నటించిన సంగతి తెలిసిందే. 

ఈ భామ సినిమాల్లోకి రాక ముందు చెన్నై లో షాపింగ్ మాల్స్ కి యాడ్స్ చేసేది. 
సమంతాకి టాలీవుడ్ లో మహేష్ బాబు,ఎన్టీఆర్ అంటే ఇష్టం అని పలు సార్లు చెప్పింది. మహేష్ బాబు అందం,ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా పిచ్చి. 

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమాలో నటించే అవకాశం మొదట సమంతా కె వచ్చింది. అయితే కొన్ని అనారోగ్య పరిస్తితుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. అయితే ఈ అవకాశం చేజారినందుకు ఇప్పటికి సమంతా బాధ పడుతుంది.
సమంతా నటించిన మొదటి సినిమాకే నంది అవార్డ్,ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో సహా అనేక అవార్డ్ పొందింది. 

తెలుగులో హిట్ కొట్టిన నాలుగు సంవత్సరాలకు తన మాతృ బాష అయిన తమిళంలో హిట్ కొట్టింది. 

సమంతా లో సేవా గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆమె ప్రత్యూష పౌండేషన్ ఏర్పాటు చేసి తన వంతు సాయాన్ని అందిస్తుంది.