అమర్ అక్బర్ ఆంటోనిలో ఇలియానా చిన్నప్పటి పాత్ర వేసింది టాప్ హీరోయిన్ కూతురు…ఎవరో చూడండి
ఈ మధ్య హిట్స్ లేని మాస్ మహారాజ్ రవితేజాకు మళ్ళీ ఇప్పుడు హిట్ వచ్చింది. రవితేజ, ఇలియానా, జంటగా నటించిన అమర్ అక్బర్ ఆంటొని శుక్రవారం రిలీజయింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందించాడు. వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడ్తున్న డైరెక్టర్ శ్రీను వైట్ల కి మళ్ళీ బ్రేక్ ఇచ్చిందని అంటున్నారు. ఇక గోవా బ్యూటీ ఇలియానా చాన్నాళ్ల తర్వాత తెలుగులో నటించిన ఈ చిత్రం టాక్ బానే ఉండడంతో వసూళ్ల వర్షం కురుస్తుందని భావిస్తున్నారు.
ఇక ఇలియానా చిన్నప్పటి పాత్రలో ఓ బాలనటి అద్భుతంగా నటించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ బాలనటి ఎవరో కాదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కూతురు శ్లోక. ఎక్స్ పోజింగ్ లేకుండా అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న లయ బాలనటిగానే రంగప్రవేశం చేసింది. భద్రం కొడుకో మూవీలో బాలనటిగా వేసింది. ఇక మనోహరం,హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో హీరోయిన్ గా తన సత్తా చాటింది. పెళ్లయ్యాక నటనకు దూరం అయింది.
అమెరికాలో సెటిల్ అయిన లయ లాస్ ఏంజిల్స్ లో ఓ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి,ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తోంది. కూతురు కూడా తల్లి పెట్టిన స్కూల్ లోనే డాన్స్ నేర్చుకుంటోంది. అమర్ అక్బర్ ఆంటొని ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో డైరెక్టర్ శ్రీను వైట్ల కోరిందే తడవుగా లయ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఇక చిన్ననాటి ఇలియానా గా శ్లోక నటించి అదరగొట్టేసింది. ఇక లయ మాదిరిగానే శ్లోక కూడా తల్లిలాగా మంచి హీరోయిన్ అవుతుందని అప్పుడే టాక్ వచ్చేసింది. కాగా ఈ సినిమాలో ఇలియానాను పాటలకే పరిమితం చేయకుండా కథలో మంచి ప్రాధాన్యత ఇస్తూ డైరెక్టర్ ఈ మూవీని జనరంజకంగా మలిచాడని, ఇలియానాకు ప్లాష్ బ్యాక్ ఉండడం బాగుందని విమర్శకులు సైతం అభినందిస్తున్నారు.