నవంబర్ 23 కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల కట్టను వెలిగించే పద్దతి… ఎందుకు వెలిగించాలో తెలుసా?

కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి గాని ఇంటిలో తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాం. ఐతే చాలా మందికి 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారో తెలియదు. ఎందుకు వెలిగిస్తారంటే…. ప్రతి రోజు ఇంటిలో ధూప,దీప నైవేద్యాలను పెడితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుందని నమ్మకం. అయితే మనకు సంవత్సరంలో ప్రతి రోజు దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని రోజులు దీపం పెట్టటానికి వీలు కాకపోవచ్చు.

అందువలన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని వత్తులను కలిపి ఆవునేతితో తడిపి ఒక కట్టగా వెలిగిస్తాం. ఇలా పౌర్ణమి రోజు 365 వత్తుల కట్టను వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందువలన మన పెద్దలు కార్తీక పౌర్ణమి రోజు తులసి లేదా ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో 365 వత్తుల కట్టను వెలిగించే సంప్రదాయాన్ని పెట్టారు.