Politics

చెల్లి సుహాసిని కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్… షాక్ లో చంద్రబాబు

తెలంగాణలో ఎన్నికల సందడి అంతాఇంతా కాదు. హేమాహేమీలు బరిలో దిగుతున్నారు. ఇక టికెట్లు రానివాళ్లు అలకలతో నిరసన జ్వాలలు రగిలిస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దుచేసి,టి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపడంతో కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ సారధ్యంలో మహాకూటమి ఏర్పడి టి ఆర్ ఎస్ కి అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఇక మహాకూటమిలో చేరిన టిడిపి కూడా అందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఆరితేరిన ఎపి సీఎం చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మళ్ళీ కేసీఆర్ రాకుండా అడ్డుకోడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ని ఢిల్లీలో కల్సిన చంద్రబాబు, ఇక తమకు కేటాయించిన 14సీట్లలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని భావించారు.

ఒక్కో సీటుకి ఎక్కువమంది పోటీ పడుతున్నప్పటికీ బుజ్జగింపుల పర్వం సాగిస్తూ, పక్కా ప్రణాళికతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక సెటిలర్స్ ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో టిడిపికి పొత్తులో సీటు దక్కడంతో ఎక్కువమంది టికెట్ ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో నందమూరి కుటుంబానికి సీటు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన చంద్రబాబు, వెంటనే అమల్లో పెట్టేసారు.

హరికృష్ణ మరణంతో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తిని బరిలో దించాలని నిర్ణయించి,హరికృష్ణ కూతురు సుహాసిని టికెట్ కేటాయించారు. నందమూరి కుటుంబానికి సీటు ఇవ్వడం వలన మిగిలిన ఆశావహులు ఇక మాట్లాడ్డానికి తావుండదని చంద్రబాబు భావించారు.
అంతేకాదు సుహాసిని గెలుపుకోసం బాబాయ్ నందమూరి బాలకృష్ణతో పాటు,సోదరులు జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి బరిలో దింపే పనిలో పడ్డారట.

సోదరి గెలుపుకోసం తారక్ వస్తాడని,అపుడు గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు కి సుహాసిని కోడలు కూడా. అందుకే సెటిలర్స్ ఓట్లు దండిగానే వేస్తారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు చాణక్యం కూకట్ పల్లిలో పనిచేస్తుందో లేదో చూడాలి.