మహేష్ బాబు కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్….ఎన్ని సినిమాలో?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు. మహేష్ బాబు ‘రాకుమారుడు’ సినిమా తో ప్రారంభించి మొన్న విడుదల అయ్యిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో 22 సినిమాలు చేసాడు. ఈ 22 సినిమాల్లో 11 సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా సరే ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ స్టార్ హీరోల రేసులో ముందుంటాడు. ఇప్పుడు ఆ ప్లాప్ సినిమాల గురించి తెలుసుకుందాం. 1. వంశీ 
బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను మహేష్ బాబాయి ఆదిశేష గిరిరావు నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ తో రోమాన్స్ చేసిన నమ్రతను మహేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
2. టక్కరి దొంగ 
ఈ సినిమాలో మహేష్ కౌబాయ్ గెటప్ లో కనిపించి అభిమానులకు కనువిందు చేసాడు. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశ పరచి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకు జయంత్ సి. పరాంజి దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 
3. బాబి

శోభన్ దర్శకత్వంలో కృష్ణ మోహన రావు నిర్మాణంలో వచ్చిన బాబి తీవ్రమైన నిరాశను కలిగించింది. 
4. నిజం 
ఈ సినిమా మహేష్ కి ఎన్నో అవార్డ్ లను తెచ్చిపెట్టింది. తేజ దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 
5. నాని 
ఎస్. జె.సూర్య దర్శకత్వంలో మంజుల నిర్మించిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. 
6. సైనికుడు 
ఒక్కడు తర్వాత మహేష్ బాబు,గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వని దత్ నిర్మించాడు. 
7. అతిధి 
యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. 
8. ఖలేజా 

అతడు తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 9. నేనొక్కడినే 
సుకుమార్,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానులనే కాకుండా మహేష్ బాబుకి కూడా షాక్ ఇచ్చింది. 

10. ఆగడు 
నేనొక్కడినే సినిమా ప్లాప్ తర్వాత శ్రీను వైట్ల మీద నమ్మకంతో చేసిన ‘ఆగడు’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 
11. బ్రహ్మోత్సవం 
పివిపి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తే, అది వారికీ కనెక్ట్ కాలేక ప్లాప్ సినిమాగా నిలిచింది.