Politics

సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా KTR నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పేరునే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కి పెట్టుకున్నారు. ఉన్నత విద్యావంతుడు, సోషల్ మీడియాలో యాక్టివిస్ట్,తెలంగాణ మంత్రి అయిన కేటీఆర్ పూర్తిపేరు కల్వకుంట్ల తారక రామారావు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్,సమస్యల పట్ల పూర్తి అవగాహన గల యువ నాయకుడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం అందరిలా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసాడు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో మంత్రిగా బాధ్యతలు పెట్టి,తనదైన ముద్రవేసాడు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ఓ విధంగా సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడని చెప్పవచ్చు.

టిఆర్ ఎస్ ప్రభుత్వంలో సమాచార, సాంకేతిక శాఖామంత్రిగా పనిచేస్తున్న కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడిగా సేవలు అందించారు. హైదరాబాద్ లో హైస్కూల్ విద్యను పూర్తిచేసి, గుంటూరు విజ్ఞాన్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదివాడు. నిజాం కాలేజీలో మైక్రో బయాలజీ, పూణే యూనివర్సిటీలో బయో టెక్నాలజీ కోర్సులు చేసి,యుఎస్ వెళ్లి, మేనేజ్ మెంట్ ఈ కామర్స్ మెయిన్ సబ్జెక్ట్ గా ఎంబీఏ పూర్తిచేసాడు. పిజి పూర్తయ్యాక అమెరికాలోని ఇంట్రా అనే సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేసాడు.

కేటీఆర్ 2004లో ఉద్యోగంలో చేరి, కొద్దికాలంలోనే ప్రమోషన్ దక్కించుకున్నాడు. ఇక ఇంట్రా సంస్థ విస్తరణలో భాగంగా కేటీఆర్ ని సౌత్ ఏషియా ఇంచార్జ్ గా హైదరాబాద్ కి పంపించారు. ఇక ఆరోజుల్లో కేటీఆర్ నెలకు అక్షరాలా 5లక్షల జీతం అందుకునేవారు. ముంబయ్,హైదరాబాద్ వంటి నగరాల్లో సంస్థ కార్యకలాపాలు పర్యవేక్షించేవాడు.

అయితే తండ్రి చేస్తున్న తెలంగాణా ఉద్యమం కోసం ఉద్యోగం వదిలేసి వచ్చాడు. ఆ ఉద్యమంలో కేసీఆర్ గెలిస్తే తెలంగాణా ఉద్యమం సజీవంగా ఉంటుందని భావించి, అతడు కూడా ఉద్యమ బాట పట్టాడు. ఇక కేసీఆర్ ఆమరణ దీక్ష,కేంద్రం దిగొచ్చి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం,రాష్ట్రం ఏర్పడ్డాక టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడడం,కేటీఆర్ మంత్రి అవ్వడం తెలిసిందే. ఈ విషయాల్ని కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడంతో అంతజీతం వదిలేసి వచ్చారా అంటూ అందరూ షాకయ్యారు.