చిరు,బాలయ్య,వెంకటేష్,నాగార్జున ఈ నలుగురు హీరోల్లో నెంబర్ వన్ ఎవరో తెలుసా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకు ఘనమైన చరిత్ర వుంది. మూకీ చిత్రాల దశనుంచి తెలుగు పరిశ్రమ ఉంది. 1921లోనే తొలిమూకి చిత్రాన్ని తెలుగు పరిశ్రమ అందించింది. ఎంతోమంది నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసారు. తొలితరం చిత్తూరు వి నాగయ్య,గోవిందరాజుల సుబ్బారావు,కస్తూరి శివరావు వంటి దిగ్గజ నటులు తమ నటనా ప్రతిభను చాటారు. ఇక తర్వాత తరంలో నందమూరి తారకరామారావు,అక్కినేని నాగేశ్వరరావు తెలుగు పరిశ్రమకు రెండు కళ్లుగా విరాజిల్లారు. అదేతరుణంలో శోభన్ బాబు, కృష్ణ,కృష్ణంరాజు లాంటి వాళ్ళు ఎంటరై మరపురాని చిత్రాలను అందించి ప్రేక్షక హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక తర్వాత జనరేషన్ కి వస్తే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ,కింగ్ నాగార్జున,విక్టరీ వెంకటేష్ లు తెలుగు సినిమాను టాప్ రేంజ్ కి తీసుకెళ్లారు. వీరి హయం వచ్చేసరికి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చేయడం వీరికి బాగా కల్సి వచ్చింది.

ఇందులో చిరంజీవి గురించి చెబితే, స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి అభిమానులతో మెగాస్టార్ అనిపించుకున్నాడు. ప్రాణం ఖరీదు చిత్రంతో నటజీవితం ఆరంభించి,ఇప్పటికే 40ఏళ్ళు అయింది. అయినా ఇప్పటికీ అత్యధిక రెమ్యునరేషన్ చిరంజీవి సొంతం. 1983లో ఖైదీ మూవీతో సోలో హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న చిరంజీవి, పసివాడి ప్రాణం,గ్యాంగ్ లీడర్,యముడికి మొగుడు,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు,జగదేక వీరుడు అతిలోక సుందరి,ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని,నటనతో,డాన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసాడు.

ఇతని పాటల్లో డాన్స్,ఫైట్స్ కి జనాలు నీరాజనం పట్టారు. ఇక తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తోలి నటుడు చిరంజీవి. ఇంద్ర,శంకర్ దాదా ఎంబిబిఎస్,ఠాగూర్, ఖైదీ నెంబర్ 151వంటి మూవీస్ చిరంజీవి ఛరిష్మాకు నిదర్శనం. రాజకీయాల్లో చేరడం వలన 9ఏళ్లపాటు సినిమాకు దూరంగా ఉండి, రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 151రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా చిరంజీవి నటించే సైరా మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరి నందమూరి బాలకృష్ణను తీసుకుంటే, ఎన్టీఆర్ తనయుడైన బాలయ్య బాలనటుడిలా రంగప్రవేశం చేసాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసినా హిట్ అంటూ లేని బాలయ్య ఆతర్వాత మంగమ్మ గారి మనవడు మూవీతో హిట్ అంటే ఏమిటో రుచి చూసాడు. పట్టాభిషేకం,దేశోద్ధారకుడు,అపూర్వ సహోదరులు,భార్గవరాముడు వంటి మూవీస్ తో వరుస హిట్స్ సాధించి, ఇండస్ట్రీలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. ఇతని కెరీలో ఎవరికీలేని ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మువ్వ గోపాలుడు,రాముడు భీముడు,బాల గోపాలుడు,నారీ నారీ నడుమ మురారి,లారీ డ్రైవర్,ముద్దుల మేనల్లుడు వంటి ఎన్నో హిట్ చిత్రాలు కనిపిస్తాయి. చిరంజీవికి బాలయ్య మధ్య గట్టిపొడీ నడిచింది. అయితే ఆ పోటీ అభిమానుల వరకే ఉండేది.

ఇక విక్టరీ వెంకటేష్ గురించి ప్రస్తావిస్తే,మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా అమెరికాలో చదువుకోడానికి వెళ్లినవాడు టాలీవుడ్ లో విక్టరీ ని ఇంటిపేరుగా మార్చుకుంటాడని ఎవరూ ఊహించలేదు. వరల్డ్ ఫేమస్ మానెటరీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన వెంకటేష్ ఎదో కంపెనీ పెట్టి,కోట్లు గడిస్తాడని అంచనా వేసారు. అయితే అనూహ్యంగా సినీ రంగప్రవేశం చేసి, కలియుగ పాండవులు తొలిమూవీతోనే హిట్ అందుకున్న వెంకటేష్ కొద్దికాలానికే స్టార్ హీరోగా ఎదిగాడు. కథకు మొదటి నుంచి అత్యధిక మార్కులు వేసే వెంకటేష్ ఎక్కువ హిట్స్ అందుకున్నాడు.

బ్రహ్మరుద్రుడు,అజేయుడు,శ్రీనివాస కళ్యాణం వంటి హిట్స్ అతని టేస్ట్ కి నిదర్శనం. రక్తతిలకం,బ్రహ్మ రుద్రుడు వంటి చిత్రాలతో మరింత రేంజ్ కి ఎదిగిన వెంకటేష్ లో కళాత్మక కోణం కూడా ఉందని స్వర్ణ కమలం మూవీ నిరూపించింది. బొబ్బిలిరాజా, శత్రువు,కూలి నెంబర్ వన్,చంటి,సుందరకాండ,రాజా,వంటి చిత్రాలతో సక్సెస్ రేటు ప్రూవ్ చేసుకున్నాడు. బాడీగార్డ్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,గోపాల గోపాల వంటి చిత్రాలతో ఇప్పుడు కూడా తన రేంజ్ ఏమిటో చూపించాడు.

కాగా అక్కినేని నాగార్జున గురించి చెప్పాల్సి వస్తే, ఇప్పుడు ప్రస్తావిస్తున్న నలుగురిలో అందరికంటే అందగాడు నాగార్జునే. ఇప్పటికీ ఏమాత్రం అందం తగ్గని నాగ్ ని మన్మధునితో పోలుస్తారు. యంగ్ హీరోలకు ఇప్పటికీ పోటీగా ఉంటున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు. డిఫరెంట్ మూవీస్ ఆకట్టుకునే నాగార్జున రొమాంటిక్ మూవీస్ తో పాటు భక్తిరస చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటాడు. నటవారసునిగా విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తొలిచిత్రంతోనే హిట్ అందుకున్నాడు. మజ్ను, కలెక్టర్ గారబ్బాయి,గీతాంజలి, శివ చిత్రాలు నాగ్ కేరీర్ ని హై లెవెల్లో నిలబెట్టాయి.

విక్కీదాదా,మురళీకృష్ణుడు,జానకి రాముడు, ఆఖరి పోరాటం వంటి సినిమాలు మరో రేంజ్ కి తీసికెళ్ళాయి. ఫిట్ నెస్,గ్లామర్ విషయాల్లో తనకు తానే సాటి. అన్నమయ్య,శ్రీరామ దాసు,ఊపిరి, మనం,వంటి చిత్రాలతో పాటు ఆత్మ ప్రధాన పాత్రలో కనిపించే సోగ్గాడే చిన్నినాయనే చిత్రంలో కూడా నటించి తన సత్తా చాటాడు. ఇప్పుడు ప్రస్తావించిన నలుగురిలో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే చెప్పటం కష్టం అయినా సరే,కొద్ది ఓట్ల తేడాతో నైనా స్వయంకృషితో టాప్ రేంజ్ కి ఎదిగిన చిరంజీవిదే. విలన్ వేషాలు వేసి, ఆతరవాత ఇండస్ట్రీని శాసించే రీతిలో ఎదగడం మామూలు విషయం కాదు.