‘జై లవకుశ’ మొదట ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందో…. ?

సినిమా ప్రపంచంలో సినిమాలు ఒక హీరో నుంచి మరో హీరో దగ్గరకు వెళుతూ ఉంటాయి. ఆ సినిమాలు హిట్ కావచ్చు. లేదా ఫట్ కావచ్చు. దర్శకుడు ఒక కథను తీసుకోని ఒక హీరో దగ్గరకు వెళ్ళితే ఆ హీరో కొన్ని మార్పులను చేయమంటారు. ఆ దర్శకుడికి ఆ మార్పులు నచ్చితే సినిమా కంటిన్యూ అవుతుంది. ఆ మార్పులు నచ్చకపోతే ఆ దర్శకుడు వేరే హీరో దగ్గరకు వెళతాడు. అలానే ఒక సినిమా రవితేజ నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. ఆ సినిమానే ‘జై లవకుశ’. ఈ సినిమాను బాబీ మొదట రవితేజకు వినిపించాడు.

మూడు క్యారెక్టర్స్ ఉండటంతో చాలా ఆసక్తిగా విన్నాడు. జై పాత్ర మినహా రెండు పాత్రలను చేయటం తేలికే అని…జై పాత్ర పొటెన్షియాలిటీని తగ్గించి మిగిలిన రెండు పాత్ర‌ల ప్రాధాన్యతను పెంచమని కోరాడు రవితేజ. ఆ మార్పులకు అంగీకరించలేని బాబీ ఆ కథను ఎన్టీఆర్ కి వినిపించటం ఎన్టీఆర్ ఒకే చేయటం చక చక జరిగిపోయాయి. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఎన్టీఆర్ ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపాడు.